అమ్మఒడి లబ్ధిదారుల జాబితా విడుదల: ఒక్కో ఖాతాలో రూ 15 వేలు: పేరు లేకుంటే లాస్ట్ ఛాన్స్ ఇలా..!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి పధకం లబ్ది దారుల జాబితా విడుదల చేసారు. ఈ జాబితాను ఆన్ లైన్ లో ఉంచటంతో పాటుగా రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబ్ధిదారులుగా తేలారు.

గ్రామ..వార్డు సచివాలయాల వద్ద

ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న ల‌బ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు.

అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. జాబితాలో అర్హత సాధించింది లేనది సచివాలయాల వద్ద అదే విధంగా నవశకం వెబ్ సైట్ లో jaganannaammavodi ద్వారా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అర్హత సాధించిది లేనిది తెలుసుకొనే వెసులుబాటు కలిగించారు.

Ammavodi qualified list displayed in Village and ward secretariats

జనవరి 9న తుది జాబితా ప్రదర్శన

ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించారు. జాబితాలపై అభ్యంతరాలు.. చేర్పులు..మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. గ్రామ సచివాయలతో పాటుగా జిల్లా ..మండల విద్యా శాఖాధికారుల వద్ద తమ అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు.

లబ్దిదారుల ఇచ్చిన సమాచారం పైన ఆ తరువాత విచారణ చేసి.. లభ్యంతరాలు..మార్పులు.. చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబ్దిదారుల తుది జాబితాను గ్రామ.. వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. దీని కోసం వెంటనే సచివాలయల వద్ద ఏర్పాటు చేసిన జాబితా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+