'జపాన్, సింగపూర్‌కు లోకల్ రుచి, ఆంధ్రులకు సాటిలేరన్న రేంజ్‌లో అదరాలి'
గుంటూరు: ఆతిథ్యంలో ఆంధ్రులకు సాటిలేరన్న రేంజ్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకలో ఆతిథ్యం అదిరిపోవాలని మంత్రి నారాయణ బుధవారం నాడు అన్నారు. అమరావతి శంకుస్థాపన అంశంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆతిథ్యానికి ఆంధ్రులకు సాటిలేరన్న రేంజ్‌లో ఉండాలన్నారు. జపాన్, సింగపూర్ ప్రతినిధులకు స్థానిక వంటకాల రుచి చూపించాలన్నారు.
అమరావతి రాజధాని వేడుకకు పారిశ్రామికవేత్తలు, రాయబారులు, ప్రముఖులు, న్యాయమూర్తులు వస్తున్నారని చెప్పారు. ఆతిథ్యం పట్ల వారు ముగ్ధులవ్వాలని అభిప్రాయపడ్డారు. భద్రతా ఏర్పాట్లకు ప్రధాని భద్రతా సిబ్బంది రేపు రానున్నారని చెప్పారు.

జగన్ ఆరోగ్యం బాగానే ఉంది: కామినేని
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి కామినేని శ్రీనివాస రావు వేరుగా చెప్పారు. ఆయన ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చన్నారు. మరోవైపు, సచివాలయంలో ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ... ఏపీలో 13వేల హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డితో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా సుగంధ, తులసి, కలబంద, మారేడు, వేప తదితర ఔషధ మొక్కలను రాష్ట్రంలో పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కామినేని తెలిపారు.
కర్నూలులో హైకోర్టు: రఘువీరా
కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బుధవారం అ్నారు. ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలను పట్టించుకోవడం లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను అన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications