ఏపీలో అమృత్ భారత్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు..! ఎప్పటి నుంచో తెలుసా ?
దక్షిణ రైల్వే పరిధిలో తాజాగా రాకపోకలు ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (Amrit Bharat Express)ల టైమింగ్స్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ తాజాగా ప్రారంభించిన మూడు అమృత్ భారత్ రైళ్లతో పాటు మరో అమృత్ భారత్ రైలు టైమింగ్స్ లోనూ కొన్ని స్టేషన్లలో సమయాల్లో మార్పులు చేస్తూ దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ మార్పులు ఏయే రైలుకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా వెల్లడించింది.
నాలుగు అమృత్ భారత్ ల సమయాల్లో మార్పు
దక్షిణ రైల్వే పరిధిలో ఎంపిక చేసిన స్టేషన్లలో నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్ని సవరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో రైలు నం.16108 సంత్రగచ్చి -తాంబరం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రైలు నం.20610 తిరుచ్చిరాపల్లి -న్యూ జల్పైగురి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రైలు నం.20604 న్యూ జల్పైగురి -అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రైలు నం.16121 తాంబరం -తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు సవరించిన సమయాలను గమనించాలని అధికారులు కోరారు.

ఏపీలోని ఈ స్టేషన్లలో టైమింగ్స్ మార్పు
రైలు నం.16108 సంత్రగచ్చి -తాంబరం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ కు ఏపీలోని శ్రీకాకుళం రోడ్ నుంచి నెల్లూరు స్టేషన్ వరకూ స్పల్పమార్పులు జరిగాయి. గమ్యస్దానమైన తాంబరానికి మాత్రం ఈ రైలు 10 నిమిషాల ముందే అంటే ఉదయం 9.05కు చేరుకోనుంది. ఈ మార్పులు ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే రైలు నం.20610 తిరుచ్చిరాపల్లి -న్యూ జల్పైగురి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ కు ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో టైమింగ్స్ స్వల్పంగా మార్చారు. ఈ మార్పులు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వస్తాయి.

The timings of the following Amrit Bharat Express services have been revised at select stations with effect from the dates mentioned:
— Southern Railway (@GMSRailway) January 30, 2026
🔹 Train No. 16108 Santragachi – Tambaram Amrit Bharat Weekly Express
🔹 Train No. 20610 Tiruchchirappalli – New Jalpaiguri Amrit Bharat Weekly… pic.twitter.com/vnPE7ylS4M
మార్పులు స్వల్పమే
అలాగే రైలు నం.20604 న్యూ జల్పైగురి -అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో టైమింగ్స్ స్వల్పంగా మార్చారు. ఈ మార్పులు ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వస్తాయి. చివరిగా రైలు నం.16121 తాంబరం -తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేవలం తాంబరం స్టేషన్లో మాత్రమే సమయాన్ని స్వల్పంగా మార్చారు. ఈ మార్పులను దక్షిణ రైల్వే ఎక్స్ లో ట్వీట్ చేసింది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications