రైలెక్కుదామని టేషనుకొచ్చింది గానీ..!!
పార్వతీపురం: ఉత్తరాంధ్రలో ఏనుగుల సంచారం అధికం. ఆంధ్రా-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విస్తరించిన దట్టమైన అడవుల్లో గజరాజుల సంఖ్య భారీగానే ఉంటోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం, ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లోని లకేరీ అడువుల్లో గుంపులు గుంపులుగా తిరుగాడుతూ ఉంటాయి ఏనుగులు.
తరచూ అటవీ ప్రాంత సమీప గ్రామాలపై దండెత్తుతుంటాయి. మైదాన ప్రాంతాలకు వస్తుంటాయి. సరిహద్దు గ్రామాలైన గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, కొమరాడ, బలిజిపేట, కల్లికోట, పసికూడి, పల్లింపేట.. తదితర ప్రాంతాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. జనంపై దాడికి దిగిన రోజులూ ఉన్నాయి.

ఆహారం, నీటి వసతి కోసం తరచూ సరిహద్దు గ్రామాల్లో తిరుగాడుతోండటం వల్ల గ్రామస్తులు తమ పంటకు రక్షణగా విద్యుత్ తీగలను అమర్చుతుంటారు. చెరకు, అరటి, బొప్పాయి వంటి పంటలకు ఉత్తరాంధ్ర ప్రాంతం అనువు కావడం వల్ల ఆహారం కోసం ఏనుగులు తరచూ సరిహద్దులను దాటుకుని పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా గ్రామాల్లో సంచరిస్తుంటాయి.
పంటలను ధ్వంసం చేస్తోండటం వల్ల వాటిని కట్టడి చేయడానికీ గతంలో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే వస్తోన్నప్పటికీ- అవి పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు. ఈ ఏనుగుల సంచారం వల్ల మైదాన ప్రాంతంలో ఉండే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదిలావుంటే- ఓ ఏనుగు ఏకంగా రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించింది. అర్ధరాత్రి దాటిన తరువాత పార్వతీపురం మన్యం జిల్లాలోని రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కనిపించింది. కొన్ని నిమిషాల పాటు ప్లాట్‌ఫామ్‌పై తిరుగాడింది. అనంతరం బయటికి వెళ్లింది. రోడ్డు మీద హల్‌చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications