Reactor Blast: అచ్యుతాపురంలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందారు.
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో గల జీఎఫ్ఎంఎస్ ఫార్మాలో మంగళవారం పేలుడు సంభవించంది. జీఎంఎఫ్‌సీ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. రియాక్టర్ పేలడంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ఎవరైనా కార్మికులు లోపల ఉన్నారేమోనని సిబ్బంది గాలింపు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. యాక్టర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కార్మిలు భయాందోళనతో ఉన్నారు.













Click it and Unblock the Notifications