Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: మంత్రి బొత్సకు ఐఎఎస్ అధికారి పాద నమస్కారం: తప్పు పట్టిన వర్ల రామయ్య

విజయనగరం: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఓ ఐఏఎస్ అధికారి.. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ కాళ్లను మొక్కి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోవడం దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యురో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఓ రాజకీయ నాయకుడికి ఐఎఎస్ అధికారి కాళ్లు మొక్కడం.. ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోందని అన్నారు.

మంత్రి కాళ్లకు..

మంత్రి కాళ్లకు..

దీనిపై ఐఎఎస్ అధికారుల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ శనివారం జిల్లాకే చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. పుష్పగుచ్ఛాన్ని అందించి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బొత్స భార్య, మాజీ లోక్‌సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ పక్కనే ఉన్నారు. పుష్ప గుచ్ఛాన్ని అందిస్తూ జాయింట్ కలెక్టర్ బొత్స సత్యనారాయణకు పాద నమస్కారం చేశారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆయన కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జాయింట్ కలెక్టర్ చేసిన పనిని తప్పు పడుతున్నారు. ప్రొటోకాల్‌ను విస్మరించారని విమర్శిస్తోన్నారు. జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్న ఐఎఎస్ అధికారి.. ఓ రాజకీయ నాయకుడి కాళ్ల మీద పడటం సబబు కాదని అంటున్నారు. జిల్లా పాలనాధికారాల్లో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఐఎఎస్ స్థాయి అధికారి మంత్రి కాళ్లకు దండం పెట్టడం ఓ అవాంఛనీయమైన సంప్రదాయంగా అభివర్ణిస్తున్నారు.

స్పందించిన వర్ల రామయ్య..

స్పందించిన వర్ల రామయ్య..

జిల్లాలో రాజకీయ నాయకులు చెప్పినట్టుగా, వారి కనుసన్నల్లో అధికారులు పని చేస్తోన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వర్ల రామయ్య అన్నారు. దీనిపై ఐఎఎస్ అధికారుల సంఘం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని, ఈ వ్యవహారాన్ని ఖండించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్థాయి హోదాల్లో ఉన్న అధికారులు ముఖ్యమంత్రి, మంత్రుల పాద నమస్కారం చేయడం కొత్తేమీ కాదు. ఇదివరకు తెలంగాణలో ఈ ఘటన సంభవించింది.

ఇదివరకు తెలంగాణలో..

ఇదివరకు తెలంగాణలో..

స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి, సిద్ధిపేట్ జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సైతం ఇదే తరహాలో కేసీఆర్ కాళ్లను నమస్కరించారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారాన్ని లేపింది. అనంతరం ఆయన తన అఖిల భారత సర్వీసుకు రాజీనామా చేశారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను శాసన మండలికి నామినేట్ చేశారు. ఇప్పుడు అదే తరహా ఘటన ఏపీలో చోటు చేసుకోవడంతో విమర్శలు వెలువడుతున్నాయి.

ప్రొటొకాల్ బ్రేక్..

ప్రొటొకాల్ బ్రేక్..

నిజానికి- అఖిల భారత స్థాయి అధికారులు అందరి పట్లా సమానత్వాన్ని చూపుతుంటారు. హుందాగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యమంత్రి సహా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారుల పట్ల వారు ప్రొటోకాల్ ప్రకారమే నడుచుకుంటారు. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించరు. ప్రొటోకాల్ ఉల్లంఘన అనేది అరుదుగా చోటు చేసుకుంటుంది. శనివారం నాటి ఘటన దీనికి భిన్నంగా కనిపించింది. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మంత్రి కాళ్లకు నమస్కారం పెట్టడం ప్రొటొకాల్‌ను ఉల్లంఘించినట్టయిందని అంటున్నారు. దీనిపై వర్ల రామయ్య స్పందించారు. ఐఎఎస్ అధికారుల సంఘం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+