వచ్చే 15ఏళ్లలో అమెరికాకు భారతీయుడే అధ్యక్షుడు: బాలకృష్ణ, బాబుకు ప్రశంస
అనంతపురం: వచ్చే 15 ఏళ్లలో అమెరికాకు భారతీయుడు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందుపురంలో స్వా తంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగించారు.
త్యాగధనులను మరవకుండా వారి ఆశయాలు కొనసాగిద్దామని, అలాగే దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్టీఆర్‌తోనే దేశంలో రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు.

జాతీయజెండా ఎగరేసుకోవడానికి స్థలం లేకపోయినా మొక్కువోనిదీక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర నిర్మణానికి కృషి చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్యాకేజీపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిని కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications