వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలో 'చిచ్చు': 'సిట్' ముందుకు మరోసారి అయ్యన్న, బాంబు పేలుస్తారా?

విశాఖజిల్లాలోని టిడిపిలో నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. విశాఖలో చోటుచేసుకొన్న భూకుంభకోణం టిడిపి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ విషయమై మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పటికే సిట్‌కు ఫిర్యాదులను అంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖజిల్లాలోని టిడిపిలో నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. విశాఖలో చోటుచేసుకొన్న భూకుంభకోణం టిడిపి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ విషయమై మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పటికే సిట్‌కు ఫిర్యాదులను అందించారు.మరోసారి ఈ నెల 19వ, తేదిన సిట్ ముందు హజరుకానున్నారు. తాజాగా ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి ఎమ్మెల్యే పీలా గోవింద్ చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు.

విశాఖలో చోటుచేసుకొన్న భూ కుంభకోణం అధికారపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయమై ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన బహిరంగ విమర్శలు పార్టీని కుదిపేశాయి.

ఈ విషయమై మంత్రి అయ్యన్నపాత్రుడి తీరుపై మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకు ఏకంగా లేఖరాశారు.అయితే ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఈ విషయమై సిట్ విచారణ సాగిస్తోంది.

అయితే ఈ విచారణసాగిస్తున్న సిట్ ముందు మంత్రి అయ్యన్నపాత్రుడు హజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ అధికారులకు అందజేశారు. మరింత సమాచారాన్ని కూడ ఆయన ప్రకటించారు.

సిట్ ముందుకు మరోసారి వెళ్ళనున్న మంత్రి అయ్యన్న

సిట్ ముందుకు మరోసారి వెళ్ళనున్న మంత్రి అయ్యన్న

ఏపీ రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ నెల 19వ, తేదిన మరోసారి సిట్ అధికారుల ముందుకు వెళ్ళనున్నారు. నాలుగురోజుల క్రితం మంత్రి అయ్యన్న సిట్ ముందు హజరై తనవద్ద ఉన్న సమాచారాన్ని ఆయన అందజేశారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన సమయంలో పరిహరం చెల్లించకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన సిట్ అధికారుల ముందు ఉంచారు. ఈ మేరకు 2015లో తాను అధికారులకు రాసిన లేఖ ప్రతిని కూడ ఆయన అందజేశారు. మరిన్ని ఆధారాలను ఈ నెల 19న అందజేయనున్నట్టు ఆయన ప్రకటిం

అనకాపల్లి పీలా గోవింద్ పై ఆరోపణలు

అనకాపల్లి పీలా గోవింద్ పై ఆరోపణలు

విశాఖ భూ కుంభకోణంలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయమై అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆయన వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనకు భూములు కబ్జా చేయాల్సిన అవసరమేలేదన్నారు. తన తండ్రి తనకు ఆస్తులను ఇచ్చారని చెప్పారు. తనపై విచారణ జరపాలని కోరినట్టు ఆయన చెప్పారు. తాను తప్పుచేసినట్టు తేలితే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ వ్యవహరం పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన చెప్పారు.అందుకే తాను బాబుకు వివరణ ఇచ్చినట్టు చెప్పారాయన.

మంత్రి అయ్యన్న హస్తం లేదు

మంత్రి అయ్యన్న హస్తం లేదు


తనపై వచ్చిన భూ కుంభకోణం వార్తలకు సంబంధించి మంత్రి అయ్యన్నపాత్రుడు హస్తం ఉందనే ఆరోపణలను కూడ ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అయితే ఈ తప్పుడు ప్రచారాల వల్ల విశాఖ జిల్లాలో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను బాబును కలిసినట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్దమేనని ఆయన ప్రకటించారు.

 20వ, తేది వరకే గడువు

20వ, తేది వరకే గడువు


విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించేందుకు ఈ నెల 20వ, తేదివరకే గడువును ఇచ్చింది సిట్. ఈ విషయమై ఇప్పటికే బిజెపి, వామపక్షాలు సిట్ అధికారులకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు సమర్పించిన ఫిర్యాదులో తప్పుడు భూమి ఆధారాల ప్రకారంగా 180 కోట్లను రుణంగా తీసుకొన్నారని ఆయన చెప్పారు.మంత్రి తదుపరి సిట్ అధికారులకు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.

English summary
Anakapally MLA Peela Govind met Ap CM Chandrababu Naidu on Tuesday in Amaravati. He explained to Chandrababu on landscam allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X