'జగన్ ఖేల్ ఖతమ్.. ఈ దీక్ష చిరంజీవి సినిమా పాటని గుర్తుతెస్తోంది!'
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జల దీక్ష పైన టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ దీక్ష చూస్తుంటే చిరంజీవి సినిమాలోని జపం జపం జపం కొంగ జపం.. తపం తపం తపం దొంగ తపం గుర్తుకు వస్తోందన్నారు.
జగన్ ఇప్పటికైనా దొంగ నాటకాలు కట్టిపెట్టాలన్నారు. జగన్.. త్వరలో నీ ఖేల్ ఖతమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దీక్షతో ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. జగన్ టైం అయిపోయిందన్నారు. జగన్ ఊరికే దీక్షలు చేస్తున్నారని, బలిసి దీక్షలు చేస్తున్నారన్నారు.

వైసిపి కార్యాలయ ముట్టడికి యత్నం
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు ఆపాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో వైయస్ జగన్ దీక్ష చేపట్టడంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ, తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన మండిపడింది.
జగన్ తీరును నిరసిస్తూ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ సమీపంలో వైసిపి కార్యాలయ ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
జగన్ చేస్తోన్న జల దీక్షను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జగన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర జల వివాదాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్న జగన్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు.
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని జగన్ పైన తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేస్తోన్న దీక్ష దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. తన దీక్ష ద్వారా తెలంగాణ వ్యతిరేకతను మరోసారి చాటుకున్నారన్నారు. వైసీపీకి ఆ పార్టీ నేత ఎడ్మ కిష్టారెడ్డి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వైసీపీలో తెలంగాణ నాయకులు ఒక్కరు కూడా ఉండకూడదన్నారు.












Click it and Unblock the Notifications