బాబును కల్సిన ఆనం: నాడు టిడిపి.. నేడు మేం: నెహ్రూ
హైదరాబాద్/విజయవాడ/న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తన కూతురు నిశ్చితార్థ వేడుకకు టిడిపి అధినేతను ఆహ్వానించేందుకు ఆనం రామనారాయణ బాబును కలిశారు.
నాడు టిడిపి.. మేం
1983లో తెలుగుదేశం పార్టీలోకి కొత్త తరం నేతలు వస్తే ఇప్పుడు తమ పార్టీలోకి వస్తున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విజయవాడలో అన్నారు. రానున్న ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో కాంగ్రెసు పార్టీ 16 స్థానాలలో గెలుస్తుందని చెప్పారు. బుద్ధప్రసాద్ వంటి నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లినా తిరిగి కాంగ్రెసులోకే వస్తారని చెప్పారు. అందరు కోరితే తన కుమారుడు అవినాష్ లోకసభకు పోటీ చేస్తారని చెప్పారు.

జడ్జీలు చెప్పారన్న సిఎం రమేష్
విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన అనంతరం కోర్టు ఆవరణలో పిటిషన్ దార్లలో ఒకరైన టిడిపి ఎంపి సిఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఇరుపక్షాలవైపు వాదించడానికి సీనియర్ జడ్డిలు వచ్చారన్నారు. వాదనల ప్రారంభంలో ఈ కేసు చాలా సున్నితమైనదని జడ్జిలు అభిప్రాయపడ్డారన్నారు.
అపాయింటెడ్ డేట్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున, ఇప్పటికిప్పుడే స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారన్నారు. అపాయింటెడ్ డేట్ లోపల కేసును ఓ కొలిక్కి తీసుకువద్దామని జడ్జిలు చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications