బాబుకు భారీ షాక్, బుజ్జగించినా నో: వైసీపీలోకి ఆనం రామనారాయణ, అక్కడే సందిగ్ధం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీ మారటం ఖాయమైందని, ఒక్క సీటు విషయంలోనే సందిగ్ధత నెలకొందని చెబుతున్నారు.

శ్రీరెడ్డి సహా వారికి కౌంటర్.. బాధగా ఉంటుంది, కానీ: పవన్ కళ్యాణ్ వీడియో వైరల్

ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. 2014లో ఆనం సోదరులు.. ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు టీడీపీలో చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆనం వివేకా పలుమార్లు టీడీపీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రామనారాయణ మాత్రం మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఆయన అసంతృప్తిని బయటకు వెళ్లగక్కలేదు.

టీడీపీపై తీవ్ర అసంతృప్తి, టచ్‌లో వైసీపీ నేతలు

టీడీపీపై తీవ్ర అసంతృప్తి, టచ్‌లో వైసీపీ నేతలు

కానీ, ఆనం రామనారాయణ రెడ్డి టిడిపి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు భేటీ అయ్యారని, చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. ఆయనతో వైసీపీ నేతలు నిత్యం టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. వైసీపీలో చేరేందుకు రామనారాయణ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

సీటు విషయంలో సందిగ్ధత

సీటు విషయంలో సందిగ్ధత

ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరాలని దాదాపు ఖరారు అయినప్పటికీ సీటు విషయంలోనే సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఆత్మకూరు సీటు ఇస్తామని వైసీపీ చెబుతోందని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం వెంకటగిరి సీటు అడుకుతున్నారని సమాచారం. ఈ సీటు అంశం కొలిక్కి వస్తే ఆయన వైసీపీలో ఏ క్షణాన్నైనా చేరడం ఖాయమని అంటున్నారు.

  2019లో అధికారంలోకి వచ్చేది మేమే : విజయసాయి రెడ్డి
  చంద్రబాబు వచ్చినప్పుడు వెళ్లిపోయిన ఆనం

  చంద్రబాబు వచ్చినప్పుడు వెళ్లిపోయిన ఆనం

  ఇటీవల ఆనం వివేకానంద రెడ్డిని పరామర్శించేందుకు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆనం రామనారాయణ.. ఉద్దేశ్యపూర్వకంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. తద్వారా పార్టీపై తన అసంతృప్తిని అలా వ్యక్తం చేశారని అంటున్నారు.

   తన కార్యాలయంలో చంద్రబాబు ఫోటోల తొలగింపు

  తన కార్యాలయంలో చంద్రబాబు ఫోటోల తొలగింపు

  అంతేకాదు, ఓ వైపు వైసీపీలో చర్చలు జరుగుతుండటం, టీడీపీ పైన అసంతృప్తి నేపథ్యంలో తన కార్యాలయంలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలను ఆనం రామనారాయణ రెడ్డి తొలగించారు. దీంతో ఆయన టీడీపీ పట్ల ఏమేరకు అసంతృప్తితో ఉన్నారో తెలుస్తోందని అంటున్నారు.

  పని చేయని బుజ్జగింపులు

  పని చేయని బుజ్జగింపులు

  ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ పట్ల అసంతృప్తితో ఉండటంతో పాటు వైసీపీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఆయనను బుజ్జగిస్తోందని తెలుస్తోంది. కానీ ఆయన బుజ్జగింపులకు తగ్గలేదని సమాచారం. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని భావిస్తున్నారని, కాబట్టి పార్టీ మారేందుకే ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఆనంకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చామని టీడీపీ చెబుతోంది.

  నెల్లూరులో రాజకీయ సమీకరణాలు మారేనా?

  నెల్లూరులో రాజకీయ సమీకరణాలు మారేనా?

  ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరితే నెల్లూరు రాజకీయాలు మారుతాయని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ వైపు మొగ్గిన నెల్లూరు వైసీపు వైపు మరలుతుందని అంటున్నారు. నెల్లూరులో ఆనం సోదరులు, మేకపాటి సోదరులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు చాలా కీలకం. ఆనం సోదరులు వైసీపీలో చేరితే అది టీడీపీకీ నష్టమే అంటున్నారు. ఇన్నాళ్లు ఆపరేషన్ ఆపర్ష్‌తో టీడీపీలో చాలామంది చేరారు. ఇప్పుడు ఆపరేషన్ వికర్ష్‌తో పలువురు వైసీపీలో చేరుతున్నారని చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Former Minister, Telugudesam Party leader Anam Vivekananda Reddy will join YSR Congress Party soon.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X