లోటస్‌పాండులో జగన్‌ను కలిసిన ఆనం రామనారాయణ, సుదీర్ఘ భేటీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండులో వైసీపీ అధినేతను కలిశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆయనను తీసుకు వచ్చారు. 45 నిమిషాలకు పైగా వారి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఆనం వైసీపీలో చేరుతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌ను కలవడం గమనార్హం.

కాగా, ఆనం తెలుగుదేశం పార్టీని వీడనున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నెలలో జగన్‌ను కలవడం రెండోసారి. ఈ నెల 7వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్‌ను కలిశారు. ఇప్పుడు మరోసారి కలిశారు. వైసీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి ఆనం పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications