చంద్రబాబుతో ఆనం వివేకా భేటీ: మతలబు ఏమిటి?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానద రెడ్డి కలిశారు. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పివై రెడ్డితో కలిసి ఆయన హైదరాబాదులోని లేక్‌వ్యూ అతిథి గృహంలో శనివారం ఉదయం కలిశారు.
ఎస్పీవై రెడ్డి జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచి, వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయనతో కలిసి ఆనం వివేకానంద రెడ్డి చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆనం వివేకానంద రెడ్డి టిడిపిలో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

చంద్రబాబు నాయుడిని ఆనం వివేకానంద రెడ్డి ఇటీవల ప్రశంసించారు కూడా. చంద్రబాబుకు పాలన విషయంలో సమయం ఇవ్వాలని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆనం వివేకానంద రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, వివేకానంద రెడ్డి ఆ ఊహాగానాలను కొట్టేస్తూ వచ్చారు.
ఇదిలావుంటే, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారంనాడు సమావేశమయ్యారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొని బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతారు.












Click it and Unblock the Notifications