రోజా నుంచి రాలేదు, రెండు మేకలు అరుస్తున్నాయి: ఆనం వివేకానంద
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం నాడు చెప్పారు.
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం నాడు చెప్పారు. ధనమదంతో వైసిపి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాన్ని తట్టుకోలేక ఆ పార్టీని చాలామంది వీడుతున్నారన్నారు.
ఆత్మకూరులో రెండు మేకలు అరుస్తున్నాయని, వైసిపి నేతలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతే శిలాఫలకాలపై పేర్లు ఉన్నాయో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించారని వైసిపి ఎంపీ, ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

కాగా, రోజా దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆనం వివేకానంద రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 8న కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం బుధవారం ఆయన్ని ఆదేశించింది.
తన పరువుకు భంగం కలిగించేలా వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ రోజా గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం విచారించారు.












Click it and Unblock the Notifications