బాబును చూస్తే భయం, అందుకే కక్షకట్టారు, సోము వీర్రాజెవరు?: జెసి సంచలనం
అమరావతి:చంద్రబాబును చూస్తే బిజెపి నేతలు భయపడుతున్నారని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బిజెపి నేతలకు చంద్రబాబునాయుడుపైనా కోపం ఉందో, లేక ఏపీ రాష్ట్రంపైనా కోపం ఉందో తనకు అర్ధం కావడం లేదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
Recommended Video

ఏపీ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల విషయమై లోక్‌సభలో టిడిపి ఎంపీల ఆందోళనల విషయమై ఓ తెలుగు న్యూస్ ఛానెల్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఈ చర్చలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ రాష్ట్రంపై కేంద్రం సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంపై జెసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎవరిపై కక్ష కట్టారో తెలియడం లేదు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎవరిపై కక్ష కట్టిందో అర్ధం కావడం లేదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.చంద్రబాబుపై కక్షతో ఇలా చేస్తున్నారా, .రాష్ట్రంపై కక్ష పెంచుకొన్నారో అర్ధం కావడం లేదని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.స్వంత పార్టీపై మక్కువ ఎక్కువై ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని జెసి అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

ఏపీకి బిజెపి ఏం చేసింది
ఏపీ రాష్ట్రానికి బిజెపి ఏం చేసిందని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.ఎంతో సహాయం చేసిన చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారే.. మోదీని తిడితే మీకు బాధ కలగదా..? అని బిజెపి నేతలను ఉద్దేశించి జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.మిత్రపక్షం కాబట్టే బీజేపీ వాళ్లను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించామని చెప్పారు. మిత్రపక్షంగా ఉండి ఏపీకి బీజేపీ ఏం ఇచ్చింది అని ప్రశ్నించారు.

చంద్రబాబు సంయమనం కోరుతున్నాడు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంయమనం పాటించాలని కోరుతున్నాడని జెసి దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చాలా సంయమనంతో పోతున్నారు! మా ముఖ్యమంత్రి చాలా బాధ్యతని జెసి దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. అంద, ఆ రకంగా ఆలోచన చేస్తున్నారు. బీజేపీపై ప్రజల్లో ఏ రకమైన ఏహ్యభావం ఉందనే విషయాన్ని మనం నిరూపించాల్సిన అవసరం ఉందని మా ముఖ్యమంత్రికి ఎప్పుడో చెప్పా.. నా సలహా ఇచ్చా. అన్నింటికీ సంయమనం..సంయమనం అంటే ఎట్లా?' అని చెప్పుకొచ్చారు.

సోమువీర్రాజు ఎవరు
టీడీపీపై బీజేపీ నేత సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు వీర్రాజు ఎవరంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు దయతోనే సోమువీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలవలేనివాళ్లు కూడా సీఎంను విమర్శిస్తారా..? ధ్వజమెత్తారు. టీడీపీ వల్లే బీజేపీకి అధికారం దక్కిందన్నారు. మిత్రపక్షం కాబట్టే బీజేపీ వాళ్లను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించామని చెప్పారు.












Click it and Unblock the Notifications