బిజెపిని నమ్మి మోసపోయాం,2 ఏళ్ళ క్రితమే రాజీనామా, పవన్ రాజకీయాలకు పనికిరాడు:జెసి

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: బిజెపిని నమ్మి మోసపోయామని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బిజెపితో పొత్తు పెట్టుకొన్నామన్నారు. అయితే దీనివల్ల రాజకీయంగా తాము నష్టపోయామని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

  YSRCP MPs Will Resign on April 6th, Chandrababu Reaction

  ఎంపీలు రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదు: చింతా మోహన్ సంచలనం

  రెండేళ్ళ క్రితమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని భావించానని జెసి చెప్పారు. మరో వైపు నేరచరిత్ర ఉన్న వైసీపీతో బిజెపి పొత్తు పెట్టుకొటుందని తాను భావించడం లేదన్నారు జెసి దివాకర్ రెడ్డి.పవన్ కళ్యాణ్ అడిగితే తన సీటును కూడ ఇస్తానని జెసి అభిప్రాయపడ్డారు.

  షాక్: ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల రాజీనామా, జగన్ దీక్ష?

  అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై జెసి స్పందించారు.

  జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?

  బాబును చూస్తే ప్రధానమంత్రి మోడీకి భయం ఉందనే కారణంగానే ఏపీ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాడనే అభిప్రాయాన్ని జెసి దివాకర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రానికి మోడీ ఇచ్చిన హమీలను అమలు చేయాలని తాము పార్లమెంట్‌లో పోరాటం చేసిన విషయాన్ని జెసి దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.

  రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. అయితే ఎప్పుడు ఏం చేయాలనే విషయమై బాబుకు బాగా తెలుసునని చెప్పారు. బిజెపి తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

   బిజెపిని నమ్మి మోస పోయాం

  బిజెపిని నమ్మి మోస పోయాం

  మేం బిజెపిని నమ్మి పోయామని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బిజెపి తీరు వల్ల మాకు కొంత నష్టం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.మోడీని నమ్మి నష్టపోయామని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకొన్నామని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బిజెపిని చూస్తే కోపం వస్తోందని జెసి అభిప్రాయపడ్డారు. బిజెపి, టిడిపిలు కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి ఉండాలన్నారు.

  మోడీకి బాబంటే అందుకే భయం

  మోడీకి బాబంటే అందుకే భయం

  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడంటే భయం ఉందేమోనని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు ఎక్కడ ముప్పు తేస్తారోననే భయం మోడీకి ఉన్నందునే చంద్రబాబునాయుడును రాజకీయంగా దెబ్బతీసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీకి చంద్రబాబునాయుడంటే ఈర్ష్య ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణాల వల్లే మోడీ ఈ రకంగా వ్యవహరిస్తున్నారా అనే అభిప్రాయాన్ని జెసి దివాకర్ రెడ్డి వ్యక్తం చేశారు.బాబు రాజకీయాల్లో ఆరితేరిన వాడు. అందుకే మోడీ ఏపీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాడేమోనని జెసి అభిప్రాయపడ్డారు.

   బిజెపి వైసీపీతో పొత్తును పెట్టుకోకపోవచ్చు

  బిజెపి వైసీపీతో పొత్తును పెట్టుకోకపోవచ్చు

  వైసీపీతో బిజెపి పొత్తు పెట్టుకొంటుందని తాను అనుకోవడం లేదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. జగన్‌పై అవినీతి మచ్చలున్నాయన్నారు. కానీ, మోడీ జగన్ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకొంటుందని భావించననని చెప్పారు. జగన్ బిజెపితో పొత్తు పెట్టుకోవలని భావిస్తే బిజెపి ఒప్పుకొంటుందా అని జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే వైసీపీ చీఫ్ జగన్ బిజెపితో పొత్తు పెట్టుకొంటారని భావిస్తున్నారని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

  రెండేళ్ళ క్రితమే రాజీనామా చేస్తానని చెప్పా

  రెండేళ్ళ క్రితమే రాజీనామా చేస్తానని చెప్పా

  రెండేళ్ళ క్రితమే తాను రాజీనామా చేస్తానని చెప్పానని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. నా ప్రజల అభివృద్ది కోసం రాజీనామాలు చేస్తానని తాను చంద్రబాబునాయుడుకు చెప్పానని .అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. ఆనాడు బిజెపి నేతలకు ప్రజలు అభిప్రాయాలను తెలిపేందుకే తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. కానీ, తనను రాజీనామా చేయకుండా చంద్రబాబునాయుడు నిలిపేశారని దివాకర్ రెడ్డి చెప్పారు.

  పవన్ కళ్యాణ్ అడిగితే నా సీటు ఇస్తా

  పవన్ కళ్యాణ్ అడిగితే నా సీటు ఇస్తా

  టిడిపితో పొత్తుండి జనసేన చీప్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన సీటు అడిగినా ఇస్తానని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరారని చెప్పారు. పవన్ కళ్యాణ్ దూత వస్తే తాను చెప్పానని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి రాజకీయాల్లో సరిపోడని చెప్పారు.ఒక వేళ ఉపఎన్నికలు వస్తే మాత్రం తానే పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Anatapuram MP Jc Diwakar Reddy sensational comments on Bjp. A Telugu channel interivewed him on Wednesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి