ఎంతమాట!: జేసుదాసుపై ఝాన్సీ కామెంట్స్‌కు అంతా షాక్
తిరుపతి : వేదికల మీద వ్యాఖ్యాతగా వ్యవహరించడమంటే మామూలు విషయం కాదు. ఏ చిన్న తప్పిదానికి చోటిచ్చినా.. అందరిలో నవ్వులపాలు కావాల్సిందే. ఇక సినీ కార్యక్రమాలకు సంబంధించిన వేదికలపై అయితే మరింత జాగ్రత్తగా మసులుకోవాల్సిందే. అంతా సెలబ్రిటీలే హాజరవుతారు కాబట్టి.. మాటల్లో తప్పులు దొర్లితే అభిమానులు సదరు యాంకర్స్ ను టార్గెట్ చేస్తారు.

ఇదంతా పక్కనబెడితే.. తాజాగా జరిగిన 'మనలో ఒకడు' ఆడియో సక్సెస్ మీట్ లో.. ప్రముఖ గాయకుడు ఏసుదాసు గురించి సంబోధిస్తూ యాంకర్ ఝాన్సీ.. 'అమర గాయకుడు ఏసుదాసు' గారు అని వ్యాఖ్యానించింది. దీంతో ఆడియో వేడుకకు హాజరైన జనమంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంతమంది నవ్వుకున్నారు కూడా.
అయితే ఇవేవి పట్టించుకోని ఝాన్సీ మాత్రం.. యథావిధిగా తన యాంకరింగ్ ను కొనసాగించింది. పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.


Click it and Unblock the Notifications