• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచలనం:ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు...గుప్తనిధులు లభ్యం

|

అనంతపురం:అదృష్టం అంటే వారిదే...ఎంతోమంది నిద్రహారాలు మాని గుప్తనిధుల కోసం పరితపిస్తూ ఎక్కడ నిధి ఉందంటే అక్కడకు వెళ్లి పిచ్చిపట్టినట్లు తవ్వకాలు జరిపినా ఏ మాత్రం కరుణించని గుప్తనిధులు అనంతపురంలో కొందరు కూలీలపై కటాక్షం చూపాయి. వివరాల్లోకి వెళితే...

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధి తట్రకల్లుకు చెందిన ఉపాధి కూలీలు ఎన్‌ఎన్‌పీ తండా సమీపంలో ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా మొక్కల పెంపకానికి గుంతలు తీస్తుండగా ముగ్గురు కూలీలకు పురాతన నాణేలతో కూడిన కుండ లభించింది. ఈ కుండలో నాణేలు బంగారంతో పాటు ఇత్తడివి కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఈ ఘటన సెప్టెంబరు 22న చోటుచేసుకున్నట్లు తెలిసింది.

అయితే పంపకాల్లో తేడాలు రావడం వలనో,మరో కారణం చేతనో ఈ విషయం బైటకు పొక్కింది. దీంతో ఈ నాణాల్లో కొన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని నాణేలను కూలీలే పోలీసులకు అప్పగించడంతో వారు నాణాల లభ్యతపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే విషయమై పోలీసులు మరి కొందరిని కొందరిని స్టేషన్‌కు పిలిపించి అడగ్గా వారికి దొరికిన 12 నాణేలను అప్పగించినట్లు తెలుస్తోంది.

Ancient coins found by Employment Guarantee Scheme workers in Anathapur District

అయితే పోలీసులకు ఇచ్చిన నాణేలు ఇత్తడివని, ఇవి గతంలో పాలించిన ముస్లింల రాజుల పేరుతో ఉన్నాయని తెలిసింది. అయితే తమకు లభించినవి ఇత్తడి నాణేలేనని...శుభ్రపరచకముందు ఒకలా...శుభ్రపరిచాక అవి మరోలా ఉన్నాయని కూలీలు చెబుతున్నట్లు తెలిసింది. అయితే ఈ నాణెల కాలం బట్టి పరిశీలిస్తే ఆ కాలంలో బంగారంవి వాడుకలో ఉన్నాయో లేదో తదిదర వివరాలు తెలుస్తాయని...ఆ వివరాలు పరిశీలించే పక్రియలో ఉన్నామని ఎస్‌ఐ ఇబ్రహీమ్‌ చెప్పారు.

అయితే తాజాగా ఉపాధి హామీ కూలీలకు దొరికిన నాణాలు...ఇటీవల పాత అమరావతిలో పర్యాటక శాఖ అధికారికి దొరికిన నాణేన్ని పోలివుండటం గమనార్హం. విదేశీయులకు అమరావతి విశేషాలను వివరిస్తుండగా అక్కడ మట్టిలో కూరుకుపోయి ఉన్న ఒక నాణెం ఆ అధికారి కంటబడింది. దీంతో ఆయన దానిని ఆసక్తిగా వెలికితీసి పరిశీలించగా దానిపై అర్థం కాని లిపిలో అక్షరాలు ఉన్నాయి.

ఆ తరువాత దానిని అక్కడే ఉన్న పురావస్తుశాఖ మ్యూజియం అధికారులకు చూపగా అద వెండితో చేయబడిన నాణెమని...దానిపై లిపి పర్షియన్ భాషలోని అక్షరాలని తెలిపారు. ఆ నాణెం సుమారు 17వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు దొరికిన నాణాలు ఇత్తడివని అంటుండగా లిపి అలాగే ఉండటం వీటిపై లిపి అలాగే ఉన్నట్లు గోచరిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Some of ancient coins with an incredible history have been discovered by Employment Guarantee Scheme workers on the site of a temple in NNP thanda Vajarakarur mandal Ananthapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more