తెలంగాణ నుంచి ఏపీకి తరలిన చంద్రబాబు
అమరావతి: వెలగపూడిలో దసరా రోజున మరో కీలక ఘట్టం ఆవిషృతమయ్యింది. తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చాంబర్‌ను ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.09 గంటలకు ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని సంప్రదాయం ప్రకారంగా ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, సీఎం సిబ్బంది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం సీఎం ఆసనంలో పూజారులు చంద్రబాబును ఆశీనుల్ని చేశారు.












Click it and Unblock the Notifications