కాపులకు గుడ్‌న్యూస్: ఒక్క కేసు లేకుండా.. అన్నీ ఎత్తివేత: పోలీస్ స్టేషన్లు ఇవే
అమరావతి: కాపు సామాజికవర్గానికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ ఇచ్చింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ఎత్తివేసింది. ఏ ఒక్క కేసు లేకుండా అన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార బిశ్వజిత్ ఈ జీవోలను విడుదల చేశారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. పోలీస్ స్టేషన్ల పేర్లు, కేసు నంబర్ల జాబితాను ప్రకటించారు.

కాపు రిజర్వేషన్ల కోసంc
తమకు రిజర్వేషన్ కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే- కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాంటూ 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ ఎంతకూ అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రముఖ కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆ సామాజిక వర్గ ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.

తుని బహిరంగ సభ..
తూర్పు గోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తుని సభ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో రత్నాచల్ రైలును కూడా తగులబెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో.. వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తరువాత కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు రిజిస్టర్ అయ్యాయి.

2020లో కొన్ని కేసులు వెనక్కి..
తునిలో రైలును తగులబెట్టడం, స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడులు చేయడం వంటి ఘటనలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్‌మెంట్, ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీలోని 109, 143, 147, 148, 149, 353, 440, 427, 435 వంటి కేసులు నమోదయ్యాయి. 2019 తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేసుల ఉపసంహరణ మొదలైంది.

2019 మార్చి వరకూ
తొలిదశలో తుని బహిరంగ సభ, రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్‌పై దాడులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం ఇదివరకు ఎత్తివేసింది. 2020 జులైలోనే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. ఆ తరువాత అంటే తుని బహిరంగ సభ జరిగిన 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. వాటి వివరాలను ఇందులో పొందుపరిచింది.
Recommended Video

పోలీస్ స్టేషన్లు ఇవే..
తుని ఘటనకు సంబంధించిన కేసులను మాత్రమే కాకుండా- రాష్ట్రవ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ఉపసంహరించున్నట్లు కుమార బిశ్వజిత్ తెలిపారు. 2019 మార్చి వరకు 161 కేసులు నమోదూనట్లు పేర్కొన్నారు. ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పీ గన్నవరం, రాజోలు, నగరం, మలికిపురం, భిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్లల్లో ఆయా కేసులు నమోదయ్యాయని, వాటిని ఎత్తేవేసినట్లు చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications