విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శెభాష్ ఎస్పీ రాజకుమారి: అర్ధరాత్రి 1.30 గంటలకు 17 మంది వలసకూలీలకు ఆహారం, నెటిజన్ల ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ వల్ల పోలీసులకు క్షణం తీరికలేకుండా పోతోంది. విధుల నిర్వహించే సమయంలో.. ఎప్పుడూ తింటున్నారో.. నిద్రపోతున్నారో కూడా తెలియడం లేదు. అయితే అప్పుడే ఇంటికొచ్చిన విజయనగరం జిల్లా ఎస్పీ బీ రాజకుమారికి రాత్రి పూట ఒక ఫోన్ వచ్చింది. తాము పట్టణానికి కొంత దూరంలో ఉన్నామని.. తినడానికి ఆహారం, కొన్ని నీళ్లు కావాలని ఆర్ద్రతతో అడిగారు. దీంతో రాజకుమారి.. తనకు సహచరులకి ఫోన్ చేసింది.. కానీ ఆహారం లేదు అని వారు చెప్పారు. తమ బ్రెడ్ ఉంది అని కొందరు చెప్పినా.. అది వారి ఆకలిని తీర్చదని భావించారు.

ఆ రాష్ట్రంలో 10, 12 వ తరగతి పరీక్షలు లేనట్టే !! పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనఆ రాష్ట్రంలో 10, 12 వ తరగతి పరీక్షలు లేనట్టే !! పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచన

 పులిహోర..

పులిహోర..

ఆ రాత్రి తానే వండాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరగా అయ్యే పులిహోరం చేసి, మంచినీళ్ల బాటిళ్లతో సహా వారు ఉన్న చోటుకు అర్ధరాత్రి 1.30 గంటలకు చేరుకున్నారు. 17 మందికి కడుపునిండా భోజనం పెట్టి.. వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. రాజకుమారి చేసిన మంచిపనిని పలువురు కొనియాడుతున్నారు. అన్నార్థులకు అన్నం పెట్టేందుకు ముందుకొచ్చిన ధీర వనిత అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇలా నంబర్ తీసుకొని..

ఇలా నంబర్ తీసుకొని..

తనకు తెలిసిన వారి వల్ల ఎస్పీ రాజకుమారి నంబర్ తీసుకున్నానని.. విజయనగరానికి చెందిన మమతా తెలిపారు. వారు ఉపాధి నిమిత్తం నెల్లూరులో ఉండేవారు. అక్కడ పనిలేకపోవడంతో.. విజయనగరం వస్తున్నారు. అయితే వారిని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో మమతా... రాజకుమారికి విషయం చెప్పారు. మంగళవారం ఆహారం తినకపోవడంతో.. మరునాడు నిరసపడిపోయారు. మమతా వద్దకొచ్చిన ఎస్పీ ఆహారం తిన్న తర్వాత.. వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

Recommended Video

AP Govt Postpones The Decision To Run APSRTC Buses In The State
 75 కేంద్రాల్లో 7 వేల మంది

75 కేంద్రాల్లో 7 వేల మంది

వలసకూలీలకు సాయం చేయాలని స్వయం సహాయక బృందాలను రాజకుమారి కోరారు. ఇతర చోట ఉన్నవారిని స్వస్థలాలకు బస్సులలో తరలిస్తున్నారు. విజయనగరంలో 75 క్వారంటన్ కేంద్రాలలో 7 వేల మందికి వసతి కల్పించారు. కానీ మమత అన్నం కావాలని కోరగా.. వెంటనే పోలీసు బాస్ రాజకుమారి స్పందించడంపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ అంటూ కొనియాడుతున్నారు.

English summary
a migrant labourer asking for food for her and 17 others moved a woman IPS officer B Raja Kumari, who rustled up lemon rice for them in a jiffy in the dead of night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X