'జగన్‌ని ఒప్పించడం జన్మలో సాధ్యంకాదు', మోడీకి గుడి కడ్తానని శివాజీ
అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేందుకే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తెలిపారు. పలు పుణ్యక్షేత్రాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టి, నీటికి నాగార్జున వర్సిటీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సర్వమత ప్రార్థనల అనంతరం చంద్రబాబు మాట్లాడారు. రాజధానికి రైతులు చేసిన త్యాగాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు. ప్రపంచంలోని అందరు దేవతలు మనలను ఆశీర్వదించారని చెప్పారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా, ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.
దసరా పర్వదినం రోజునే మనకు రాజధాని శంకుస్థాపన పండుగ వచ్చిందన్నారు. రాజధానికి 33వేల ఎకరాలు ఇచ్చి రైతులు చరిత్ర సృష్టించారని చెప్పారు. విజయ దశమి రోజు ఏ పని చేసినా విజయవంతం అవుతుందన్నారు. దేనినైనా నమ్మకం అనే మాట నడిపిస్తుందన్నారు. మనం అలాగే సంకల్పంతో ముందుకెళ్దామన్నారు.
కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వేరుగా మాట్లాడుతూ... ఏవియేషన్ రాయితీతో ప్రయాణీకుల సంఖ్య పెరిగిందన్నారు. కార్గో సర్వీసులతో కూరగాయలు, మందులు ఎగుమతి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిని ఒప్పించడం జన్మకు సాధ్యం కాదన్నారు.

రాజధాని కోసం
ఏపీ రాజధాని శంకుస్థాపన సందర్భంగా దేశంలోని పుణ్యక్షేత్రాలు, రాష్ట్రం నలుమూలల నుంచి సేకరించిన మట్టి, నీరుకు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజధాని కోసం
అనంతరం ఆ కలశాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో పెట్టి అమరావతికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

రాజధాని కోసం
రాజధాని అమరావతి నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజల్ని భాగస్వాములు చేయడమే ప్రభుత్వ సంకల్పమని ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత అన్నారు.

రాజధాని కోసం
క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటూ క్రీడా సంకల్ప జ్యోతి యాత్రను పలు చోట్ల ప్రారంభిస్తున్నారు.

రాజధాని కోసం
ఇందులో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవాలయం నుంచి క్రీడాజ్యోతిని మంత్రులు దేవినేని ఉమా, పరిటాల సునీతతోపాటు క్రీడా శాఖ ముఖ్యకార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి ప్రారంభించారు.

రాజధాని కోసం
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల నుంచి క్రీడాజ్యోతుల్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.

రాజధాని కోసం
గుణదల మేరీమాత చర్చి, అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం, గుంటూరు మర్కస్ మసీద్, బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం నుంచి సంకల్ప జ్యోతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

రాజధాని కోసం
ఇవన్నీ శంకుస్థాపన కార్యక్రమ వేదిక ఉద్దండరాయుని పాలెంకు చేరకుంటాయని, అక్కడ జరిగే మహాసంకల్ప జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని వివరించారు.

రాజధాని కోసం
అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటన చేయాలని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు.

రాజధాని కోసం
ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మోదీ మాస్కులు ధరించి వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తే మోడీకి గుడి కడతామని సమాఖ్య నాయకుడు కారెం శివాజీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications