సివిల్స్ విజేతను చేసిన అవమానం-ఆంధ్రా కానిస్టేబుల్ విజయ గాథ..!
తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన గతేడాది సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఓ అరుదైన విషయం బయటపడింది. ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా ఈ విజయం వెనుక ఉన్న పట్టుదల ఎలాంటిది అన్న విషయం తాజాగా వెల్లడైంది. దీంతో అంతా ఆతన్ని ప్రశంసిస్తున్నారు.
2013 నుంచి 2018 వరకూ ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ గా పనిచేసాడు. ఆ సమయంలో తన ఉన్నతాధికారి (సీఐ) చేతిలో కృష్ణారెడ్డికి ఓ రోజు తీరని అవమానం జరిగింది. దీంతో ఆయన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. అంతే కాదు ఎలాగైనా సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం రాత్రీ పగలూ శ్రమించాడు. సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు.

గతంలో సీఐ తనను 60 మంది పోలీసుల ముందు అవమానించాడని, అదే రోజు ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ కావడం మొదలుపెట్టానని కృష్ణారెడ్డి ఇప్పుడు యూపీఎస్సీ ఫలితాల ప్రకటన అనంతం తెలిపాడు. వ్యక్తిగత ద్వేషం కారణంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తనను 60 మంది పోలీసుల ముందు అవమానించాడని, అప్పుడే యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కానీ ప్రస్తుతం తాను సాధించిన 780వ ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఉద్యోగం మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో మరోసారి సివిల్స్ రాసి ఎలాగైనా ఐఏఎస్ సాధిస్తానని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ సాధించే వరకూ ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని చెప్తున్నాడు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications