కోతలు తగ్గాయి: ఏపీలో విద్యుత్ మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకం ద్వారా దేశంలోని చాలా రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు తగ్గిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలు.. 2013-14లో 6.9శాతంగా ఉన్న విద్యుత్ కొరత(ఎనర్జీ షార్టేజ్)ను ఏప్రిల్ 2017 వరకు 0.1శాతానికి తగ్గించడం జరిగింది. అదే విధంగా 2013-14లో ఉన్న పీక్ షార్టేజీని 2017 ఏప్రిల్ వరకు 0.5శాతానికి తగ్గించడం జరిగింది.

అంతేగాక, దక్షిణ భారతదేశ ట్రాన్స్‌మిషన్ లైన్స్ 116శాతానికి పెంచడం జరిగింది. దీంతో రెండంకెల సంఖ్యతో ఉన్న రేటు యూనిట్‌కు రూ.3కి పడిపోయింది.

ఉదయ్(ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన): అందరికీ 24గంటల విద్యుత్ లక్ష్యంతో ఈ పథకం విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది.
వీటి వల్ల రూ.4,400 కోట్ల మేర లాభం పొందడం జరిగింది. ఉదయ్ బాండ్స్, చీపర్ ఫండ్స్, ఏటీఅండ్ సీలో రిడక్షన్, ట్రాన్సిమిషన్ నష్టాలు తగ్గించడం, ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం, బొగ్గు సంస్కరణలు మొదలగునవి జరిగాయి. ప్రతీ ఏడాది రూ.6,200కోట్లను రాష్ట్రం పొదుపు చేసుకునే అవకాశం లభించింది.

అందరికీ ఎల్ఈడీలను అందించేందుకు ఉన్నత్ జ్యోతి(ఉజల):

2కోట్లకు పైగా ఎల్ఈడీ లైట్లను రాష్ట్రంలో పంపిణీ చేయడం జరిగింది. దీని ఫలితంగా రూ.1,126కోట్ల మేర వినియోగదారులు ప్రతీ యేడాది పొదుపు చేయడం జరిగుతోంది. 564మెగావాట్ల పీక్ డిమాండ్‌ను తప్పించి, ప్రతీ సంవత్సరం 22.7 లక్షల టన్నుల కార్పన్ డై ఆక్సైడ్‌ను తగ్గించడం జరుగుతోంది.

ఉర్జా(అర్బన్ జ్యోతి అభియాన్)
2016 మే నెలలో రాష్ట్రంలో నగరాల్లో 6:07గంటల విద్యుత్ కోతలుండేది. కానీ, మే 2017నాటికి అది 3.44గంటలకు తగ్గిపోయింది.

కోల్ మంత్రిత్వశాఖ విజయాలు

విద్యుత్ వినియోగం, బొగ్గు అమ్మకం కోసం రాష్ట్రంలో 2((మదన్‌పూర్ దక్షిణ సులియారి) కోల్ మైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

బొగ్గు కొరత నుంచి మిగులు

అక్టోబర్ 21, 2014 నాటికి మూడింట్లో మూడు థర్మల్ ప్లాంట్లు ఏడు రోజుల స్టాక్ కూడా ఏర్పాటు చేయడం కష్టంగా ఉండేది. కాని, ఇప్పుడు(ఏప్రిల్3, 2017) ఏ ప్లాంటు‌లోనూ షార్టేజీ లేదు.

Andhra Pradesh: Achievements of the Ministry of Power

పునరుత్పదక ఎనర్జీ విజయాలు

తక్కువ ధరకే రికార్డు స్థాయిలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తి జరుగుతోంది.
కడప సోలార్ ప్రాజెక్టు నుంచి రూ.3.15కే సోలార్ విద్యుత్ అందించడం జరుగుతోంది.

రెన్యూవబుల్ జనరల్ కెపాసిటీ

గత మూడేళ్లలో 338శఆతం రెన్యూవబుల్ జనరల్ కెపాసిటీ పెరిగింది. 2014మార్చిలో 1407 మెగావాట్ల ఉండగా, అది మార్చి 2017నాటికి 6164మెగావాట్లకు పెరిగిపోయింది.

పవన విద్యుత్

విజయాలు:

2016-17కాలంలో 2187.45మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా సాధించింది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తంలో ఉత్పత్తి చేయలేకపోయింది. రాష్ట్రంలో పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తి భారీగా జరుగుతోంది.

సోలార్ పంప్స్

మార్చి 2014 నుంచి 1632శాతం మేర సోలార్ పంప్స్ పెరిగిపోయాయి. 2014లో ఇది 613 సోలార్ పంప్స్ ఉండగా, 2017మార్చి నాటికి ఇది 10,619కి పెరిగిపోయింది.

మైన్స్(గనుల) విజయాలు

తామ్రా(ట్రాన్స్‌స్పరెన్సీ యాక్షన్ మానిటరింగ్ అండ్ రీసోర్స్ అగ్మెంటేషన్) పోర్టల్/యాప్‌లు మైనింగ్ సంబంధత కార్యక్రమాలను చురుగ్గా చేశాయి. వేలాల్లో పారదర్శకత వల్ల రాష్ట్రానికి రూ.345కోట్ల రెవెన్యూ చేకూరింది.

జిల్లా మినరల్ ఫౌండేషన్(డీఎంఎఫ్)ల ద్వారా ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన(పీఎంకేకేకేవై) అమలు చేయబడుతోంది. మైన్స్ కేటాయింపు, వేలం, మైనింగ్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్రంలో డీఎంఎఫ్ ద్వారా రూ. 200కోట్లు(జూన్2, 2017వరకు) సేకరించడం జరిగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Energy shortage reduced to 0.1% during the period April, 2017 from 6.9% in 2013-14Peak shortage reduced to 0.5% during the period April, 2017 from 6.5% in 2013-14South Indian transmission lines increased by 116% thereby reducing short term electricity rates from double digits to around Rs. 3 per unit.
Please Wait while comments are loading...