ఏపీ కేబినెట్ భేటీలో పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పోలవరం ప్రాజుక్టుపై కీలక చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. ఇక, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను కొత్తగా నిర్మించనుంది.

కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం నీతి ఆయోగ్​లో ఏపీ ప్రతిపాదించనుంది. ఢిల్లీలో జులై 27 తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రతిపాదనలు పెట్టనున్నారు సీఎం చంద్రబాబు. నీతి ఆయోగ్​‌లో ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావటంతో ప్రస్తుతం దానిపై అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహించారు.

Andhra Pradesh cabinet meeting key decision on Polavaram project

పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన ప్రాజెక్టును సందర్శించారు. గతంలో జరిగిన పనులు, ప్రస్తుత ప్రాజెక్టు పరిస్థితిపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా పోలవరం ప్రాజెక్టులు ముందుకు కదల్లేదని చంద్రబాబు మండిపడ్డారు.

కాగా, ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ఆర్థిక సాయంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జులై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో పలు అంశాలను వెల్లడించింది. ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు గ్యారెంటీలకు భరోసా ఇచ్చింది. మున్ముందు మరింత సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ ప్రతిపాదనలను నీతి ఆయోగ్ ముందుంచనున్నారు సీఎం చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+