బాబు అదిరే ప్లాన్: 'అమరావతి'లో 'ఆస్తానా' ట్విస్ట్: మిక్స్‌డ్ జోన్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కజకిస్తాన్ రాజధాని ఆస్తానాను చూసి ముగ్ధులయ్యారు. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో దాని స్ఫూర్తిగా తీసుకొని మార్పులు, చేర్పూలు చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

నేడు అమరావతిలా, నాడు ఆస్తానా కష్టాలు: పట్టుబట్టి బాబుని పంపిన మోడీ
చంద్రబాబు ఇటీవలే కజకిస్తాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. రాజధాని ఆస్తానాను దాదాపు రెండు దశాబ్దాల క్రితం పక్కా ప్రణాళికతో నిర్మించారు. అమరావతి నిర్మాణంలోను అందులోని కొన్నింటిని అమలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు.

దానికి అనుగుణంగా అమరావతి నిర్మాణంలో మార్పులు చేయవచ్చు. ప్రస్తుతం అమరావతి నగర ప్లాన్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే జోన్‌లో ఉంటాయి. ఇందులో ఎలాంటి రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ కార్యక్రమాలు ఉండవు. కార్యాలయాలుగా ఉంటాయి.

అమరావతికి ఆమ్‌స్టర్‌డామ్ స్ఫూర్తి: బాబు గురించి తెలుసని ఆఫ్ఘన్ మేయర్
ఇక్కడి కార్యాలయాలలో ప్రభుత్వ ఉద్యోగుల పని అయిపోయాక, వారి వెళ్లిపోతే అక్కడ ఇక దాదాపు ఏమీ కనిపించదు. అయితే, ఆస్తానాలో మాత్రం అలా కాదు. అది మిక్స్‌డ్ జోన్. అమరావతి కూడా అలా ఉండాలని ఇప్పుడు చంద్రబాబు భావిస్తున్నారు.

ఆస్తానాలో ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట నిర్మించలేదు. అంతేకాదు, ప్రభుత్వ కార్యాలయాల సమం అయిపోయిన తర్వాత అక్కడ మరిన్ని కార్యకలాపాలు జరుగుతాయి. అలా అది మిక్స్డ్‌డ్ జోన్. అమరావతిని కూడా అలా చేయనున్నారని తెలుస్తోంది.

Andhra Pradesh capital Amaravati to get an Astana twist

ఆస్తానా వలె.. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ మరిన్ని యాక్టివిటీస్ జరిగేలా మిక్స్‌డ్ జోన్స్‌గా ఏర్పాటు చేయనున్నారు. దానికి అనుగుణంగా ప్రస్తుత ప్రణాళికను మార్చాలని భావిస్తున్నారు. అక్కడ రిసెడెన్షియల్ అపార్టుమెంట్స్ లేదా ఇండివిడ్యూయల్ ఇళ్లు లేదా కమర్షియల్ యాక్టివిటీస్ జరిగేలా ఉండొచ్చు.

తన కజకిస్తాన్ పర్యటన సందర్భంగా చంద్రబాబు ఆస్తానాలో పర్యటించటారు. అక్కడి అధికారులతో చర్చించారు. ఆస్తానా మేయర్‌తో మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో ఆస్తానా పాలుపంచుకుంటుందని చెప్పారు. ఆస్తానాతో కలిసి ముందుకెళ్లేలా రోడ్ మ్యాప్ తయారు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

మోడీకి బాబు రూ.1000 నోట్లపై సూచన, అక్కడా జగన్ టార్గెట్!
ఐదుగురితో కూడిన సభ్యులతో కలిసి పని చేయాలని చంద్రబాబు, ఆస్తానా మేయర్ నిర్ణయించారు. గత ఏడాది ప్రధాని మోడీ ఆస్తానలో పర్యటించిన అనంతరం, ఆ రాజధానికి ముగ్దుడై చంద్రబాబును కూడా చూసి రమ్మని సూచించారు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు.

ఆస్తానలోని పార్కింగ్ సిస్టంకు కూడా చంద్రబాబు ముగ్దుడయ్యారు. ఇక్కడ ఎక్కడ కూడా కార్యాలయాల ముందు వాహనాలను ఆపరు. ప్రతి వాహనం కూడా అక్కడి కార్యాలయాల అండర్ గ్రౌండులోని ఖాళీ స్థలంలో ఆపుతారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Impressed by Astana, the capital of Kazakhstan, which he visited recently, AP Chief Minister N. Chandrababu Naidu is likely to bring some changes in the construction plan of the capital Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి