ఏపీ రాజధాని: మోడల్ పరిశీలిస్తున్నారు(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని సలహా కమిటీ గాంధీనగర్‌లో పర్యటించింది. గిఫ్ట్ సిటీ, పెట్రో యూనివర్సిటీని సందర్శించారు. నారాయణ నేతృత్వంలో రాజధాని కమిటీ గుజరాత్, పంజాబ్ - హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రాజధాని నగరాలను సందర్శించి అక్కడ అనుసరించిన నిర్మాణ, ప్రణాళికల అంశాలను అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా తొలిదశలో మంగళవారం గాంధీనగర్‌లో పర్యటించింది. ఉదయం గాంధీనగర్ చేరుకున్న బృందం గుజరాత్ పట్టణాభివృద్ధి శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు స్వాగతించారు.

గిఫ్ట్ సిటీ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్, టెక్నాలజీ సిటీ)కి తీసుకు వెళ్లారు. గిఫ్ట్ సిటీలో వివిధ ప్రభుత్వ భవన సముదాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను బృందంలోని సభ్యులు పరిశీలించారు.

అనంతరం గుజరాత్ సచివాలయానికి చేరుకొని గిఫ్ట్ సిటీ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ షా, గుజరాత్ అభివృద్ధి సంస్థ సీఈవో డీ తార, అదనపు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అలోరియా తదితరుల అధికారులతో గిఫ్ట్ సిటీ ప్రణాళికా నమూనా, నిర్మాణ దశలు, ఆ రాష్ట్రంలోని పట్టణ ప్రణాళిక విధానాలు, తాగునీరు సరఫరా, వ్యర్థ పదార్థాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

 రాజధాని కమిటీ

రాజధాని కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని సలహా కమిటీ గాంధీనగర్‌లో పర్యటించింది. గిఫ్ట్ సిటీ, పెట్రో యూనివర్సిటీని సందర్శించారు. నారాయణ నేతృత్వంలో రాజధాని కమిటీ గుజరాత్, పంజాబ్ - హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రాజధాని నగరాలను సందర్శించి అక్కడ అనుసరించిన నిర్మాణ, ప్రణాళికల అంశాలను అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా తొలిదశలో మంగళవారం గాంధీనగర్‌లో పర్యటించింది.

రాజధాని కమిటీ

రాజధాని కమిటీ

రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పౌర జీవనానికి అవసరమైన ఇతర వసతుల కల్పనలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకున్నారు.

రాజధాని కమిటీ

రాజధాని కమిటీ

ఆ తర్వాత అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లను సందర్శించారు. గాంధీ నగర్లోని పండిట్ దీనదయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి వర్సిటీ వసతులు, పని తీరుపై అధ్యయనం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

రాజధాని కమిటీ

రాజధాని కమిటీ

ఈ తరహా వర్సిటీ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రితో పాటు రాజధాని సలహా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, మున్సిపల్ శాఖ కమిషనర్ వాణీమోహన్, పట్టణ ఆర్థిక మౌలిక వసతుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై మధుసూదన్ రెడ్డి, ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ డాక్టర్ పాండు రంగారావు, డీటీసీపీ డైరెక్టర్ తిమ్మారెడ్డలు ఉన్నారు. కాగా, బుధవారం చండీగఢ్, గురువారం నయా రాయ్‌పూర్‌లను బృందం పరిశీలించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+