ఏపీ కొత్త రాజధాని పేరు పరిశీలనలో అమరావతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి అమరావతి అనే పేరును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్న సింగపూర్ ప్రతినిధుల బృందం కొద్ది రోజుల క్రిందట దీని కాన్సెప్ట్ నోట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చింది.
ఈ సందర్భంగా కొత్త రాజధానికి అమరావతి పేరు ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి ఆ బృందాన్ని ప్రశ్నించారని సమాచారం. అంతకంటే ముందు సీఎం చంద్రబాబు పాల్గొన్న ఓ సమావశంలో అమరావతి పేరు పైన చర్చ సాగిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుకు గత కొద్దికాలంగా పలు రకాల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ రేసులో లేను

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శనివారం చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఆలోచనలు గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ప్రతిబింబించాయని పేర్కొన్నారు.
విభజనానంతరం తీవ్ర ఆర్థిక లోటులో పడిన రాష్ట్రాన్ని హుధుద్ తుఫాను, వర్షాభావం, కరువు పరిస్థితులు మరింత కష్టాల్లోకి నెట్టాయన్నారు. అయినప్పటికీ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2020 నాటికి రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ దిశగా అన్ని రంగాలకూ సముచిత ప్రాధాన్యంతో బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.












Click it and Unblock the Notifications