వివేకా హత్య కేసులో కీలక మలుపు- హత్య ఆయుధాలు స్వాధీనం: ఇక..తేల్చుడే..!!

మాజీ మంత్రి..ముఖ్యమంత్రి జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ఇప్పటికే పలువురిని విచారించింది. అనేక కోణాల్లో విచారణ కొనసాగించింది. అయితే, ఇప్పుడు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. కొద్ది రోజులు క్రితం గోవాలో ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న సునీల్ యాదవ్ ను గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు..పులివెందుల కోర్టులో హాజరు పరిచారు.

హత్య ఆయుధాల స్వాధీనం..!!

హత్య ఆయుధాల స్వాధీనం..!!


తరువాత విచారణ కోసం కోర్టు అనుమతి తీసుకున్న తరువాత...హత్యకు వినియోగించిన ఆయుధాల కోసం పులివెందుల అన్వేషించారు. కానీ, అవి దొరకలేదు. దీంతో..ఈ రోజు ప్రత్యేక టీంలుగా వచ్చిన అధికారులు ఒకే సమయంలో పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఇందు కోసం ప్రత్యేకంగా డిల్లీ నుంచి కడపకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం ఏక కాలంలో సోదాల్లో పాల్గొంది.

 ఇతర అధికారులతో కలిసి పక్కాగా..

ఇతర అధికారులతో కలిసి పక్కాగా..


వారితో పాటుగా.. జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు. సునీల్ యాదవ్ సీబీఐ విచారణలో .. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తుకు లేదని చెప్పడంతో తనదైన శైలిలో విచారణ నిర్వహించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమాచారం మేరకు ఈ రోజు నాలుగు చోట్ల ..అనుమానితుల నివాసాల్లో సోదాలు చేయగా..అక్కడ హత్యకు వినియోగించిన ఆయుధాలు దొరికినట్లుగా తెలుస్తోంది. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ తో స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సిబిఐ అధికారులు...తమను సునీల్ తప్పు దోవ పట్టించాడని నిర్ధారణకు వచ్చారు.

 సునీల్-కిరణ్ ఆధారాలు సేకరణ..

సునీల్-కిరణ్ ఆధారాలు సేకరణ..

అదే సమయంలో సునీల్ నివాసం నుంచి బ్యాంకు పుస్తకాలు..ఖాళీగా ఉన్న సంకతాలు చేసిన దస్తావేజులు.. కీలక వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఉన్న డెయిరీ సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నగదు లావాదీవీలకు సంబంధించిన రసీదులు సైతం సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. దీని ద్వారా వివేకా హత్య కేసులో కీలక సమాచారం.. ఆధారాలు సీబీఐ అధికారులు సేకరించినట్లుగా భావిస్తున్నారు. అయితే, రహస్యంగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు సునీల్ అసలు విచారణలో ఏం చెప్పాడనే విషయం మాత్రం బయటకు పొక్కనీయటం లేదు.

కేసు చివరి దశకు చేరిందంటూ..

కేసు చివరి దశకు చేరిందంటూ..

2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఆ తరువాత విచారణ సమయంలోనూ...రాజకీయంగానూ అనేక సమీకరణాలు మారాయి. దీని పైన విచారణ చేస్తున్న సీబీఐ గత నాలుగు రోజులుగా విచారణలో దూకుడు పెంచాయి. త్వరలోనే వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ వ్యక్తిగత సిబ్బందితో పాటుగా ఒక పత్రిక కు చెందిన ప్రతినిధులను సీబీఐ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది.

 అన్ని లావాదేవీలపై ఆరా..త్వరలోనే కొలిక్కి..

అన్ని లావాదేవీలపై ఆరా..త్వరలోనే కొలిక్కి..

ఈ రోజు ఉదయం కర్నాటక నుండి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కడపలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. అక్కడ జరిగిన ఆర్ధిక లావాదేవీలు, భూములుపై వివరాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పులివెందులలో సునీల్ తల్లి సావిత్రమ్మ, తమ్ముడు కిరణ్‌లను స్వగ్రామం మోటునూతనపల్లెకు సీబీఐ బృందం తీసుకెళ్లింది. పులివెందులకు చెందిన వివేకా అత్యంత సన్నిహితడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌లను సీబీఐ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. ఇరువురిని కడపకు తరలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సీబీఐ వేగంగా సాగిస్తున్న తరుణంలో ఈ హత్యకు కారకులు ఎవరనేది త్వరలోనే తేలే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+