ఇలాగైతే కేసీఆర్‌తో సరే, గొడవకు సిద్ధంగా లేను: చంద్రబాబు
అమరావతి: తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహానం వ్యక్తం చేశారు. చైనా పర్యటనకు సంబంధించిన విశేషాలను ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాకు వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడాన్ని ఆయన తప్పబట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ తెలంగాణకు చెందుతుందని అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారని చెప్పిన చంద్రబాబు, విభజన తీరుని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా తప్పుబట్టిందని అన్నారు.
రాష్ట్ర విభజన బాధలను కేంద్రమంత్రులకు మరోసారి చెప్పానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో గొడవకు దిగేందుకు తాను సిద్ధంగా లేనని ఆయన అన్నారు. విభజన వల్ల అన్యాయం జరిగింది ఏపీకి అని కేంద్రం, తెలంగాణ తెలుసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పదేళ్లు ఉండేందుకు అవకాశం ఉన్నా.. ఉంటున్నామా? అని ఆయన ప్రశ్నించారు.

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కేసీఆర్ నేను మాట్లాడుకుంటాం కానీ సమస్యను పరిష్కరించేందని ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో లేదని చెప్పిన చంద్రబాబు ఆ ఆంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.
హైకోర్టు విభజన పద్ధతి ప్రకారం జరగాల్సి ఉందని అన్నారు. పంజాబ్ రాష్ట్ర విభజన సమయంలో జరిగింది, ఏపీలో జరగొద్దనే ఉద్దేశంతో సంయమనంతో ఉంటున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో అన్నీ వదులుకుని వచ్చిన వాళ్లం, కోర్టు కోసం గొడవపడతామా అని అన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ. 2500 కోట్లు మాత్రమే ఇస్తానని అంటోందని అన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం తొమ్మిది సిటీలను అభివృద్ధి చేస్తే రాష్ట్రాభివృద్ధికి ఢోకా లేదన్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే వైసీపీ విమర్శలు చేస్తోందని విమర్శించారు.
చంద్రబాబుకు ట్విట్టర్‌లో కేటీఆర్ ఝలక్
అమరావతిలో సచివాలయాన్ని నిర్మించుకుని పాలన ప్రారంభించడం అభినందనీయమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సచివాలయాన్ని నిర్మించుకున్నారు.. మరి హైకోర్టు అవసరం లేదా? అని ట్విట్టర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టుకు అంత ప్రాధాన్యత లేదా? అని ట్వీట్ చేశారు.
Sir,Congratulations on the milestone. To expedite justice delivery,isn't it imp that AP has High Court in Amaravati? https://t.co/HrFkipyKps
— KTR (@KTRTRS) July 1, 2016
Extremely happy as a new chapter begins in the history of Andhra Pradesh as our Govt has started functioning from #Amaravati today.
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2016
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications