ముగిసిన సింగపూర్ టూర్, సిటీకి చేరుకున్న బాబు
హైదరాబాద్: మూడు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ బృందానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తన సింగపూర్ పర్యటన విజయవంతమైనదని అన్నారు. సింగపూర్ లో 300 మంది పారిశ్రామిక వేత్తలు తమ బృందంతో మాట్లాడారని ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. వారిలో చాలా మంది జనవరిలో ఒప్పందాలు చేసుకోవడానికి రాష్ట్రానికి రానున్నట్లు ఆయన వివరించారు.
ఈ నెల 23 నుంచి 29 వరకు బాబు జపాన్ లో పర్యటించనున్నారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను 2022 నాటికి దేశంలోని మూడు ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటిగా బాబు తీర్చిదిద్దుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2029 నాటికి ఏపీ ప్రపంచంలోని అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముగిసిన సింగపూర్ టూర్, సిటీకి చంద్రబాబు
మూడు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు.

ముగిసిన సింగపూర్ టూర్, సిటీకి చంద్రబాబు
ఈ బృందానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు స్వాగతం పలికారు.

ముగిసిన సింగపూర్ టూర్, సిటీకి చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తన సింగపూర్ పర్యటన విజయవంతమైనదని అన్నారు.

ముగిసిన సింగపూర్ టూర్, సిటీకి చంద్రబాబు
సింగపూర్ లో 300 మంది పారిశ్రామిక వేత్తలు తమ బృందంతో మాట్లాడారని ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. వారిలో చాలా మంది జనవరిలో ఒప్పందాలు చేసుకోవడానికి రాష్ట్రానికి రానున్నట్లు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications