ఏపీలో పెరిగిన కరోనా వ్యాప్తి .. కొత్తగా 547 పాజిటివ్ కేసులు.. విశాఖలో ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 547 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. విశాఖలో ఒకరు మరణించినట్లు తెలిపింది. కొత్తగా 128 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. అత్యధికకంగా చిత్తూరు జిల్లాలో 96 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి..
ఏపీలో పెరిగిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 33,339 శాంపిల్స్ పరీక్షించగా 547 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 128 మంది వైరస్ బారినుంచి కోలుకోగా, విశాఖ పట్నంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు చిత్తూరు జిల్లాలో 96 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖ జిల్లాలో 89, కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 49, తూర్పు గోదావరి 43, పశ్చిమగోదావరి 43 మందికి వైరస్ సోకింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించినట్లు చెప్పారు.

యాక్టివ్ కేసులు 2,266
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 20,76,028 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 20,59, 262 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారికి వైద్యం అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,500కు చేరింది.

ప్రకాశం జిల్లాలో ఒమిక్రాన్ బాధితులు
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 28 మందికి ఒమిక్రాన్ బారిన పడ్డారు. బుధవారం కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే వచ్చిన ఇద్దరికి , విదేశాల నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ప్రకాశం జిల్లాలకు చెందిన ముగ్గురు, గుంటూరుకు చెందిన మహిళ ఉన్నారు. ఒమిక్రాన్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారికి టెస్టులు నిర్వహించారు.

వ్యాక్సినేషన్ వేగవంతం
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వారికి మొదటి డోసు వ్యాక్సిన్ పంపిణీలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మూడు రోజుల్లోనే 52.82 శాతం మందికి టీకాలు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 12, 89,501 మందికి వ్యాక్సిన్ వేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 76.09 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications