గుడివాడలో అరాచకం: ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడి: మహిళా కండక్టర్‌పైనా
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భవనాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనపిస్తోంది.
రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో నేలమట్టం చేశారు.

విశాఖపట్నంలో కొత్తగా నిర్మితమైన భవనానికీ నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమ కట్టడమని, నిర్మాణంలో ఉల్లంఘటనలు చోటు చేసుకున్నాయంటూ నోటీసులు ఇచ్చారు. అనంతపురం, రాజమండ్రి..ఇలా దాదాపుగా పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందాయి.
అదే సమయంలో- రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు తెలుగుదేశం శ్రేణులు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల విధ్వంసం సైతం కొనసాగుతూనే ఉంది. అనేక చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. కొన్నింటిని కూలగొట్టారు.
ఇటీవలే వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో గల వైఎస్సార్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పింటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది.
తాజాగా- ఓ ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడటం ఆందోళనకు గురి చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఖాకీ దుస్తులతో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌ను ఆర్టీసీ బస్సు ముందు కొట్టడం, బూతులు తిట్టడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది.
తనను కొట్టొద్దంటూ బస్సు డ్రైవర్ పక్కకు వెళ్లినప్పటికీ వాళ్లు వదల్దేదు. అతని వెంటపడి మరీ కొట్టారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఈ వీడియోలో కనిపించింది. ఇలాంటి పరిణామాలపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications