ఏపీలో దీపావళి టపాసులపై ప్రభుత్వం ఆంక్షలు- ఆ రెండు గంటలే అవకాశం
కరోనా ప్రభావం ఈసారి దీపావళి సంబరాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైరస్ దృష్ట్యా దీపావళి బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో తెలియక మథన పడ్డ వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం స్వల్ప ఊరటనిచ్చింది. కాలుష్యం వెదజల్లని పర్యావరణహిత టపాసులు మాత్రమే అమ్మాలని ఆదేశించింది.
Recommended Video
కరోనా వ్యాప్తి అవకాశాలున్నందున కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో దీపావళి బాణాసంచా క్రయవిక్రయాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ పూర్తిగా నిషేధించింది. కాలుష్య ప్రభావం తక్కువగా ఉన్న చోట కూడా పర్యావరణ హిత బాణాసంచా అమ్మాలని, అలాగే వాటిని కాల్చే సమయాన్ని కూడా భారీగా కుదించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఎన్జీటీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే బాణాసంచా కాల్చాలని ఆదేశించింది.

కరోనా ప్రభావానికి ముందే బాణాసంచా రేట్లు మండిపోతున్నాయి. కొన్నేళ్లుగా పెరుగుతున్న ధరలతో బాణాసంచా కాల్చేందుకు జనం భయపడే పరిస్ధితి. ప్రభుత్వాల నుంచి కూడా సహకారం లేకపోవడంతో బాణాసంచా వ్యాపారాలు కూడా మందగించాయి.
వరుస ప్రమాదాలతో బాణాసంచా తయారీ కూడా తగ్గింది. దీంతో సహజంగానే ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో కుదేలవుతున్న వ్యాపారాలను కరోనా మరింత కష్టాల్లోకి నెట్టింది. కరోనా వ్యాప్తి భయాలతో ఈ ఏడాది ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో బాణాసంచా అమ్మకాలతో పాటు కాల్చడంపైనా ప్రభుత్వాలు, న్యాయస్ధానాలు ఆంక్షలు విధించాయి.












Click it and Unblock the Notifications