ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి
ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా మద్యం దుకాణాలను వైఎస్ జగన్ ప్రభుత్వమే నిర్వహించింది. ఆ సమయంలో జాతీయంగా, అంతర్జాతీయంగా పేరెన్నికగన్న బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురాలేదు. స్థానికంగా తయారయ్యే మద్యాన్ని సరఫరా చేయడంతో దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ మందుబాబులు ఆందోళన చేసేవారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో మందుబాబుల పంట పండింది. ఇకనుంచి మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తులద్వారానే నిర్వహింపచేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంపీరియల్ బ్లూ వచ్చేసింది
బ్రాండెడ్ మద్యం ఏపీలో ఇకనుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ ఇంపీరియల్ బ్లూ, మెక్ డొవెల్స్ లాంటి బ్రాండ్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న రాయల్ ఛాలెంజ్, జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, వోడ్కా, బ్లాక్ డాగ్ లాంటివన్నీ ఏపీలోని మద్యంలో షాపుల్లో విక్రయించనున్నారు. వచ్చేనెల ఒకటోతేదీ నుంచి నూతన మద్యం విధానం తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా 10 శాతం మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే లిక్కర్ విధానం మారుస్తామని ప్రకటించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మద్యం విధానాన్ని సంపూర్ణంగా మార్చేశారు.

రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలు
గతంలో బ్రాండెడ్ మద్యం దొరక్క తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి మరీ మందుబాబులు కొనుగోలు చేసుకొని తెచ్చేవారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించి వీటిని ఎక్స్ జ్ శాఖ స్వాధీనం చేసుకునేది. ఆయాన రాష్ట్రాలకు సరిహద్దుల్లో నివసించేవారు మాత్రం రోజు ద్విచక్రవాహనాలపై వెళ్లి తమకు కావల్సిన బ్రాండ్లు తెచ్చుకునేవారు. కొంతమంది హైదరాబాద్ నుంచి గుంటూరు రైలు ద్వారా బ్రాండెడ్ మద్యాన్ని సరఫరా చేసేవారు. సికింద్రాబాద్ లో కొందరు వ్యక్తులు ఒక సీటు నెంబరు పేరు గుంటూరులో ఉన్నవారికి చెప్పి ఆ సీటు కింద సరుకు ఉంచేవారు. గుంటూరులో సంబంధిత వ్యక్తులు వచ్చి ఆ సీటుకింద ఉన్న బాక్సులను తీసుకువెళ్లేవారు. ఎవరికీ అనుమానం రాకుండా చేసినప్పటికీ చివరకు దొరికిపోవడంతో కటకటాలపాలయ్యారు.
కాగా, గతంలో ఏపీలో నాసిరకం బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో మందుబాబులు పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్రమంగా మద్యం తెచ్చుకునేవారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ తెచ్చుకునేవారు. ఇక నుంచి వారికి ఆ ఇబ్బందులు ఉండవు. ప్రముఖ లిక్కర్ బ్రాండ్లు ఏపీలోనే అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications