వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడను జగన్ పావుగా వాడుకొంటున్నారు: కాపు కార్పోరేషన్ ఛైర్మెన్

కాపుల్ని అడ్డుపెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకోవాడానికి వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారని కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ చలమలశెట్టి రామానుజయ ఆరోపించారు. దీని కోసం ఆయన ముద్రగడ పద్మనాభాన్ని పావుగా

By Narsimha
|
Google Oneindia TeluguNews

మంగళగిరి: కాపుల్ని అడ్డుపెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకోవాడానికి వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారని కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ చలమలశెట్టి రామానుజయ ఆరోపించారు. దీని కోసం ఆయన ముద్రగడ పద్మనాభాన్ని పావుగా వాడుకొంటున్నారని ఆయన ఆరోపించారు.

కాపుల మధ్య విభేదాలు సృష్టిస్తూ విపక్షనేత రాష్ట్రానికి శనిలా దాపురించారని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారంనాడు కాపు డ్రైవర్ల శిక్షణ శిబిరం ముగింపు సభలో ఆయన మాట్లాడారు.

Andhra pradesh government plans for Kapu reservations legally

స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం చంద్రబాబునాయుడు కాపు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు.కాపులను చట్టబద్దంగా బీసీల్లో చేర్పించేందుకు చంద్రబాబునాయుడు గట్టి సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ముద్రగడ వ్యవహరం వెనుక జగన్ కుట్ర ఉందన్నారు.

వైఎస్ తనకు అత్యంత సన్నిహితుడని చెప్పుకొంటున్న ముద్రగడ, వైఎస్ అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ సంగతిని ఎందుకు విస్మరించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడు తరహలో బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన.

కాపు కార్పోరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన రాజమండ్రిలో ఆదివారం నాడు తెల్లవారుజామున చోటుచేసుకొంది. గుర్తు తెలియని వ్యక్తులు పూల కుండీలను బద్దలుకొట్టి కొన్నింటిని కారుపై విసిరారు. దీంతో వేణుగోపాలరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎవరికీ భయపడనని వేణుగోపాలరాయుడు చెప్పారు.

విపక్షం రెచ్చగొడుతోంది: మంత్రి నక్కా ఆనంద్‌బాబు

రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఓర్వలేని ప్రతిపక్షం కులాలను, వర్గాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొందని మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. ఆదివారం నాడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు ఇడుపులపాయ ఎస్టేట్ అభివృద్దికి వాడుకొన్న వైఎస్ కుటుంబం దేవరపల్లిలో దళిత భూముల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాజారెడ్డి నుండి వైఎస్‌వరకు ఆ కుటుంబమంతా దళిత భూములను దోచుకొందని ఆయన ఆరోపించారు.

English summary
Andhra pradesh government planning for Kapu reservations legally said Kapu corporation chairman chalamashetti Ramanujaya .he participated kapu drivers training programme in Mangalagiri on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X