రైతుల ఖాతాల్లో డబ్బులు... ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

చంద్రబాబునాయుడు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. ప్రధానంగా రైతులు ఉద్యాన పంటలు సాగుచేసేందుకు అవసరమైన రాయితీని ఇచ్చేందుకు, ఆ సాగుకు అవసరమైన పరికరాలను సంబంధిత కంపెనీలచేత ఇప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. కంపెనీల ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు. తాజాగా ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం మరో శుభవార్తను వినిపించింది.

రూ.6 కోట్ల రాయితీ
రాష్ట్రంలోని హార్టీకల్చర్ రైతులకు రాయితీ కింద దాదాపు రూ.6 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీఅయ్యాయి. జులైలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు డీబీటీ ఇన్ పుట్ రాయితీని 8376 మంది రైతులకు అందించనున్నారు. అలాగే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో రైతుల సంతకాలు అవసరం లేకుండా వారికి కౌలు కార్డులు అందించాలనే కీలకమైన నిర్ణయం కేబినెట్ తీసుకుంది. రైతుల భూమి హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ కార్డులు ఇవ్వాలని, దీనిపై యాజమాన్యానికి ఉన్న అపోహలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రబీ సీజన్ కు వీటిని అన్నదాతలకు అందజేస్తారు.

andhra pradesh government released flood relief fund and horticulture farmers input subsidy

చిరు వ్యాపారికి రూ.25వేలు
పంట నష్టపోయిన రైతులకు హెక్టారు కింద పత్తికి రూ.25వేలు, అరటికి రూ.35వేలు, వేరుశనగకు రూ.15వేలు, రెస్టిరేషన్ కు రూ.15వేలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్నకు రూ.15వేల చొప్పున ఇవ్వనున్నారు. గతంలో చిరు వ్యాపారులకు రూ.5వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చేవారు. ప్రస్తుతం దాన్ని రూ.25వేలకు పెంచారు. వరద సమయంలో తామిచ్చిన మాటకు కట్టుబడి ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు, వరదలవల్ల నష్టపోయిన రహదారులకు మరమ్మతులు నిర్వహించేందుకు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అత్యవసరంగా కూడా ప్రభుత్వం నగదును విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+