హైదరాబాద్ ఓయో హోటల్‌లో ఏపీ టీచర్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న జయప్రకాశ్ నారాయణ ఏపీలోని రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
శనివారం మధ్యాహ్నం రాయచోటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి మియాపూర్ మదీనాగూడలోని ఓయో లాడ్జిలో రూమ్ తీసుకున్నారు జయప్రకాశ్ నారాయణ. ఆ తర్వాత విషం మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి జయప్రకాశ్ ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యలు శనివారం రాత్రి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేయించిన కోడలు
కుటుంబ కలహాలు, ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో చోటు చేసుకుంది. ఆస్తి కోసం తన బంధువులచే అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. కువైట్‌లో ఉన్న కొడుకుకు సీఐడీ పోలీసుల పేరిట ఫోన్ బెదిరింపులు కూడా చేయించింది.
వారం రోజుల క్రితం అత్త లక్ష్మి నరసమ్మను కిడ్నాప్ చేసి రాయచోటికి తరలించి చిత్రహింసలు పెట్టింది. తన ఆస్తి వారి పేరిట ఉన్న పేపర్లలో బలవంతంగా వేలి ముద్రలు వేసుకొని, నాలుగు తులాల సరుడు, ఐదు గ్రాముల కమ్మలు,సెల్ ఫోన్ దౌర్జన్యంగా లాక్కుని వదిలి వేశారు. ఈ క్రమంలో అత్త లక్ష్మీనరసమ్మ పోలీసులను ఆశ్రయించింది. కోడలిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు అత్త లక్ష్మి నరసమ్మ ఫిర్యాదు చేసింది. అత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications