అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఏడు జిల్లాల్లో కరోనా వైరస్ జీరో కేసులు: ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అనుమానమే..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో శ్రీకాకుళం, విజయనగరం సహా మరో అయిదు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వైరస్ తీవ్రత కొంతమేరకైనా తగ్గుముఖం పట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగుతాయా? లేదా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 56 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 19 చొప్పన కేసులు వెలుగు చూశాయి.

ఏడు జిల్లాల్లో జీరో కేసులు..

ఏడు జిల్లాల్లో జీరో కేసులు..

ఈ రెండు జిల్లాలు తప్పితే మిగిలిన నాలుగు జిల్లాల్లో రెండంకెలను దాటలేదీ ఈ కేసుల సంఖ్య. అలాగే మరో ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా అధికారులు భావిస్తున్నారు. తాజాగా నమోదైన సంఖ్యతో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలో 203, గుంటూరు జిల్లాలో 177కు చేరుకున్నాయి. అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జీరో కేసులు నమోదు అయ్యాయి. వీటిల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముందునుంచీ ఒక్క కేసు నమోదు కాలేదు.

తీవ్రత అధికంగా ఉన్న చోట్ల పరిమితంగానే.. .

తీవ్రత అధికంగా ఉన్న చోట్ల పరిమితంగానే.. .

తాజాగా మరో అయిదు జిల్లాలు ఈ జాబితాలో చేరాయి. కాగా- చిత్తూరులో 6, కడపలో 5, కృష్ణాలో 3, ప్రకాశంలో నాలుగు కేసులే నమోదు అయ్యాయి. నిజానికి- ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఇదివరకు భారీ ఎత్తున కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ 24 గంటల్లో మాత్రం రెండంకెలకే పరిమతం కావడాన్ని బట్టి చూస్తోంటే.. కరోనా తీవ్రత నియంత్రణలోకి వచ్చిందని అంచనా వేస్తున్నారు. మున్ముందు ఇదే తరహాలో కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశాలు మాత్రం చాలా పరిమితంగానే ఉన్నాయి చెబుతున్నారు. రేపేలా ఉంటుందనేది అంచనా వేయలేమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

యాక్టివ్ కేసులు 669

యాక్టివ్ కేసులు 669

రాష్ట్రంలో నమోదైన యాక్టివ్ కేసుల సంఖ్య 669కి చేరింది. మొత్తం 813 పాజిటివ్ కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నవి 669. కరోనా వైరస్ బారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చేరి, చికిత్స పొందిన 120 మంది పూర్తిగా కోలుకున్నారు. వారంతా డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన వారిలో కడప, గుంటూరు జిల్లాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో 23 మంది చొప్పున డిశ్చార్జి అయ్యారు. విశాఖపట్నం-19, కృష్ణా-16, పశ్చిమ గోదావరి-9, తూర్పు గోదావరి-8, అనంతపురం-7, నెల్లూరు-6 ఉన్నాయి. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఒకరు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Recommended Video

Doctors Declare April 23 As Black Day | ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తుంటే దాడులు చేస్తారా ?
అత్యధిక మరణాలూ గుంటూరులోనే..

అత్యధిక మరణాలూ గుంటూరులోనే..

కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యధికులు గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. ఈ జిల్లాలో ఇప్పటిదాకా ఎనిమిది మంది కరోనా వల్ల మృతి చెందారు. కృష్ణాలో ఆరుమంది మృత్యువాత పడ్డారు. కర్నూలు-5, అనంతపురం-3, నెల్లూరు-2 మరణించారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కడప, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా వల్ల ఇప్పటిదాకా ఎలాంటి మరణాలు కూడా నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

English summary
Andhra Pradesh have registered zero covid-19 Coronavirus cases in Seven district of the State. Six districts have reported as 56 cases. Medical and Health Departments issued the fresh bulleting on Wednesday, which was carried last 24 hours data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X