హైకోర్టు: ఏపీలో నిర్మించిన తర్వాతే విభజన, ఇక్కడున్నది తెలంగాణకే
హైదరాబాద్: హైకోర్టని విభజించేందుకు వీలులేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో కొత్త హైకోర్టుని నిర్మించిన తర్వాత మాత్రమే విభజన జరుగుతుందని స్పష్టం చేసింది. అప్పటి వరుక ఇరు రాష్ట్రాలకు హైకోర్టు ఉమ్మడిగానే కొనసాగుతుందని తేల్చి చెప్పింది.
ఏపీలో హైకోర్టు నిర్మించేందుకు కేంద్రమే నిధులు మంజూరు చేయాలని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని న్యాయస్థానం పేర్కొంది. తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టుకు వీలు లేదని ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది.

అవసరమైతే ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత బెంచీలు పెట్టుకోవచ్చని, ఇప్పటికిప్పుడు హైకోర్టుని విభజించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇక ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో ఓ భవనాన్ని కేటాయించింది.
అలా ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఉమ్మడి హైకోర్టుని రెండుగా విభజించాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈరోజు హైకోర్టు తుది తీర్పుని వెలువరించింది.
ఇది ఇలా ఉంటే ఏపీ రాజధాని ప్రాంత రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన వారి జోలికి వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వానికి కోర్టు అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications