• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్ణాటక ఓ ట్రయలర్ మాత్రమే, పింక్ డైమాండ్ గురించి మేం సమాధానం చెప్పం:లోకేష్

By Srinivas
|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే ఏ పార్టీతో అయినా తాము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచే అవకాశాలు లేవని చెప్పారు.

బీజేపీ పైన పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని, ప్రాంతీయ పార్టీలు కలిస్తేనే బీజేపీకి బుద్ధి చెప్పే వీలుందన్నారు.

కర్ణాటక ట్రయలర్, 2019లో అసలు సినిమా ఉంది

కర్ణాటక ట్రయలర్, 2019లో అసలు సినిమా ఉంది

కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై 13 పార్టీల అధినేతలు, పలువురు ముఖ్యమంత్రులు ఉండటం, ఎన్నికల్లో తెలుగు ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారనే వ్యాఖ్యలపై నారా లోకేష్ స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారని, కర్ణాటకలో అన్ని పార్టీలు ఏకమైంది కేవలం ట్రయలర్ మాత్రమేనని, 2019లో అసలు సినిమా ఉందని చెప్పారు.

పవన్ కళ్యాణ్ అనే మేధావి రాష్ట్రాన్ని ముంచారు, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా: జగన్

వార్డు మెంబర్‌గా గెలవలేని వారు ఎమ్మెల్యేలుగా

వార్డు మెంబర్‌గా గెలవలేని వారు ఎమ్మెల్యేలుగా

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ పార్టీలో కనీసం వార్డు మెంబర్‌గా గెలవలేని వారికి కూడా తాము ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచే అవకాశమిచ్చామని లోకేష్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచేందుకు టీడీపీ ఉపయోగపడిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దేశంలో ఎలా ఉందో, బీజేపీ ఇలాగే మారుతుందని చెప్పారు.

ఊహించని ట్విస్ట్: చేయి కలిపి రాహుల్ భుజం తట్టిన చంద్రబాబు, ఏకమైన 14 పార్టీలు, వేర్వేరుగా చర్చలు

పింక్ డైమాండ్ గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

పింక్ డైమాండ్ గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదని లోకేష్ చెప్పారు. ఈ విషయంలో దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు. గత ఏడాది విశాఖలో మహానాడును బాగా నిర్వహించారని, అంతకంటే ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఎన్నో కేసుల్లో నిందితులుగా ఉన్న ఏ1, ఏ2లు జగన్, విజయసాయి రెడ్డిలు పింక్ డైమాండ్ గురించి అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు రూ.9 లక్షల ఆదాయం చూపిన జగన్ ఆయన సీఎం అయ్యాక రూ.30 కోట్ల పన్ను ఎలా కట్టారని ప్రశ్నించారు.

లోటస్ పాండులో తిరుమల ఆభరణాలు సీబీఐ తవ్వితీస్తుంది

లోటస్ పాండులో తిరుమల ఆభరణాలు సీబీఐ తవ్వితీస్తుంది

చంద్రబాబు ఇంట్లో పన్నెండు గంటల్లో సోదా చేస్తే వెంకన్న ఆభరణాలు దొరుకుతాయన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు. హోదా గురించి ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం లేని ఏ1, ఏ2లు బీజేపీతో చేతులు కలిపి టీడీపీపై క్విడ్ ప్రోకో రాజకీయాలకు తెరలేపారన్నారు. గతంలో తిరుమల జోలికి వచ్చినవారు ఎక్కడున్నారో మీకే బాగా తెలుసునని, గుడిని, గుడిలో లింగాన్ని మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేత, నకిలీ పార్టీ నాయకులు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, తిరుమల ఆభరణాలు, విలువైన ప్రజా సంపదను ఇడుపులపాయ, లోటస్‌పాండ్‌, యలహంక కోటలో ఉన్న నేల మాళిగల్లోంచి సీబీఐ తవ్వి తీస్తుందని లోకేష్‌ పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh IT Minister Nara Lokesh said that what happened to the Bharatiya Janata Party (BJP) in Karnataka Assembly polls was just a 'trailer' and that a 'real cinema' would be shown in 2019 general election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more