అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని??

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశం మొత్తానికి తన పరిధి విస్తరించాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే అన్నింటికన్నా తెలంగాణకు కవల రాష్ట్రమైన ఏపీలో పోటీచేయాలనుకోవడం.. దానికి ఆయన ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం విభజనకు గురవడానికి కేసీఆర్ ప్రధాన కారణమని ఇక్కడి ప్రజల ప్రగాఢమైన నమ్మకం. జరిగిన పరిణామాలు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి.

ఏపీలో ఫ్లెక్సీలు

ఏపీలో ఫ్లెక్సీలు

కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఏపీలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదా మాటేంటి? పోలవరం ప్రాజెక్టుపై నిర్ణయం ఏమిటి? రాజధాని విషయంలో భారత రాష్ట్ర సమితి అభిప్రాయం ఏమిటి? రాజధాని నగర నిర్మాణానికి అవసరమై నిధులు ఎలా? విభజన తర్వాత ఆగమాగమైన ఏపీ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ వీటిపై ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. అమరావతి శంకుస్థాపన రోజు తాను భారీగా సాయం చేయాలనుకున్నప్పటికీ ప్రధానమంత్రి కేవలం మట్టి, నీళ్లు ఇవ్వడంతో ఆయనకు మించి భారీగా ప్రకటన చేయకూడదన్న ఉద్దేశంతో ఆరోజు తానేమీ ఇవ్వలేదని కేసీఆర్ ఇప్పటికీ చెబుతుంటారు.

నమ్మకమైన ఓటుబ్యాంకు సెటిలర్లే

నమ్మకమైన ఓటుబ్యాంకు సెటిలర్లే

తెలంగాణలో భారతీయ జనతాపార్టీతో తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో ఆ పార్టీకి చివరకు నమ్మకమైన ఓటుబ్యాంకుగా సెటిలర్లు నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. తెలంగాణ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ గెలుపొందగా, సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలిచింది. విభజన గాయం ఇప్పుడిప్పుడే మానుతున్న సమయంలో బీఆర్ఎస్ రంగ ప్రవేశం చేస్తుండటంతో ఏపీ ప్రజల మెదళ్లలో పలు సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అవమానాలు మరిచిపోయారా? గుర్తులేదా?

అవమానాలు మరిచిపోయారా? గుర్తులేదా?


ఉద్యమ సమయంలో ఎంతో అవమానానికి గురైన ఆంధ్రుడు బీఆర్ఎస్ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమేంటనే సందేహం వారిని తొలిచేస్తోంది. జరిగినవన్నీ వారు మరిచిపోయారా? రాజకీయ నాయకులు వాడిన భాషను, పదాలను, వాక్యాలను ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారు మరిచిపోయారా? లేదంటే వారికొక పార్టీ దొరికింది కాబట్టి ఆ చెట్టు నీడన తాము కూడా ఎదగడానికి గతాన్ని పూడ్చిపెట్టి అనంతమైన భవిష్యత్తును వెతుక్కుందామనుకుంటున్నారా? అని ప్రజలు వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు. ఎన్ని గాయాలైనా, ఎన్ని అవమానాలెదురైనా కులం ముందు అవన్నీ తమకు తూచ్ అనుకుంటే.. సంతోషంగా బీఆర్ఎస్ ను ఆదరిద్దామనుకునేవారు కూడా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+