ఏపీకి భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. జులైలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే మూడురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆదివారం రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈనెల 3, 4 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని, అదే రోజు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయంది. 4వ తేదీన పల్నాడు, బాపట్ల, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, కృష్ణ, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల,

శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలతో పాటు పలుచోట్ల పిడుగులు పడతాయని, వర్షం పడే సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వాన కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఉండొద్దని పేర్కొంది.












Click it and Unblock the Notifications