వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఉచితాలకు కోత తప్పదా: కీలక ఆదేశాలు జారీ దిశగా కేంద్ర ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

అమరావతి: పొరుగుదేశం శ్రీలంక పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ ఊబి నుంచి బయటపడటానికి ఆ దేశ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఈ పరిణామాలు రాజకీయ అనిశ్చితికీ దారి తీశాయి. తిండి దొరకని పరిస్థితి ఏర్పడిన తమదేశంలో ఉండలేక వందలాది మంది స్వదేశాన్ని వీడుతున్నారు. నేరమే అయినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితల్లో భారత్‌కు వలస వస్తోన్నారు. ఈ పరిస్థితుల నుంచి భారత్ పాఠం నేర్చుకోవాల్సి ఉంటుందని, ఉచిత పథకాలకు కోత పెట్టాల్సి ఉంటుందనే సూచనలు కేంద్ర ప్రభుత్వానికి అందుతున్నాయి.

కేంద్రానికి కీలక సూచనలు..

కేంద్రానికి కీలక సూచనలు..

శ్రీలంక సంక్షోభ ప్రభావంపై కొద్దిరోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధానిలో కొన్ని కీలక శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. నీతి ఆయోగ్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని రాష్ట్రాలు తాము కొనసాగిస్తోన్న ఉచిత పథకాలకు కోత పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అలా జరక్కపోతే శ్రీలంక తరహా సంక్షోభ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని సూచించారు. లంకలో నెలకొన్న తరహా ఆర్థిక పరిస్థితులే కొన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పడ్డాయని, వాటిని అదుపు చేయాలని పేర్కొన్నారు.

పంజాబ్, ఉత్తర ప్రదేశ్ సహా..

పంజాబ్, ఉత్తర ప్రదేశ్ సహా..


ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రాలు- ప్రచార సమయంలో పెద్ద ఎత్తున హామీలను ఇచ్చాయి. వాటన్నింటినీ అమలు చేయడానికి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమౌతుంది. 300 యూనిట్ల వరకు గృహావసరాల కోసం ఉచిత విద్యుత్‌, ప్రతినెలా 1,000 రూపాయల నగదును సరఫరా చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ రెండింటి వల్ల 20,000 కోట్ల రూపాయల అదనపు భారం ఖజానాపై పడుతుంది. ఫలితంగా- ఇప్పుడున్న పంజాబ్ రుణాలు వచ్చే అయిదేళ్ల నాటికి 2.82 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.

 ఏపీలో అదే తరహా పరిస్థితులు..

ఏపీలో అదే తరహా పరిస్థితులు..

ఏపీలోనూ దాదాపు అవే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. సామాజిక పింఛన్లు, రైతు భరోసా, జగనన్న చేదోడు, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, నేతన్న హస్తం, వాహనమిత్ర, కాపునేస్తం, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత వంటి పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం అర్హులకు 10 వేల రూపాయల వరకు నగదును బదిలీ చేస్తోంది. ఇలాంటి ఉచిత పథకాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమలు చేయడం సరికాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 3.89 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలు చేయడానికి ఇది కారణమైందని స్పష్టం చేస్తోన్నారు.

యూపీ తక్కువేమీ కాదు..

యూపీ తక్కువేమీ కాదు..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉచిత పథకాల హామీ ఇచ్చింది. అర్హత గల కుటుంబాలకు ఉచితంగా ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లను ఇస్తామని ప్రకటించింది. ఇదివరకే చేసిన లక్షల కోట్ల రూపాయల రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ రెట్టింపు అవుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాలు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి పెద్ద ఎత్తున రుణాలను తీసుకుంటోన్నాయని అంటున్నారు.

కేంద్రం అప్రమత్తం..

కేంద్రం అప్రమత్తం..

ఈ పరిస్థితులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని, ఈ దిశగా పావులు కదుపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పరిమితికి మించి ఉచితాలు, నగదు బదిలీ, సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేయొచ్చని అంటున్నారు. నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, ఎఫ్ఆర్‌బీఎం కమిటీతో మరోసారి సమావేశాలను నిర్వహించిన అనంతరం ఈ దిశగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంటుందని తెలుస్తోంది.

English summary
CAG data shows UP’s interest payments have grown by 6% in 5 years. Andhra’s outstanding debt hit Rs 3.89 lakh crore in 2021-22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X