వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ మరో వరం: స్టాలిన్‌ను కాదని..!!

|
Google Oneindia TeluguNews

కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో తన పట్టును నిలుపుకొంటోన్నారు. రాష్ట్రానికి అవసరమైన వరుస ప్రాజెక్టులను సాధించుకుంటోన్నారు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులను పొందారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికీ ముందడుగు వేశారు. త్వరలో ఈ పోర్ట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Recommended Video

Bulk Drug Park In Andhra Pradesh మొదటి సౌత్ స్టేట్ ఆంధ్రానే *AndhraPradesh | Telugu Oneindia
బల్క్ డ్రగ్ పార్క్..

బల్క్ డ్రగ్ పార్క్..

ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి తెప్పించుకున్నారు వైఎస్ జగన్. బల్క్ డ్రగ్ పార్క్‌‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. దీని విలువ 1,000 కోట్ల రూపాయలు. ఈ మేరకు ఫార్మాసూటికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు లేఖ రాశారు.

90 రోజుల్లో..

90 రోజుల్లో..

ప్రిన్సిపల్ అప్రూవల్ లేఖను అందినప్పటి తేదీ నుంచి 90 రోజుల్లోగా ఈ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను అందజేయాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలం కేపీ పురం-కోదాడ వద్ద బల్క్ డ్రగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి స్కీమ్ స్టీిరింగ్ కమిటీ అంగీకరించినట్లు తెలిపారు. ఈ పార్క్‌లో సాధారణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందించడానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ఈ లేఖలో వివరించారు.

డీపీఆర్‌లో..

డీపీఆర్‌లో..

డీపీఆర్‌ను ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు సమర్పించాలని కోరారు.ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయదలిచిన ప్రదేశం, మొత్తం భూభాగం, అందులో నెలకొల్పడానికి అవసరమైన బల్క్ డ్రగ్ యూనిట్లకు కేటాయించడానికి అవసరమైన స్థలాల వివరాలను చేర్చాలని చెప్పారు. గ్రీన్ బెల్ట్, ల్యాండ్‌స్కేప్, కాస్ట్, ఇన్సూరెన్స్, ప్రాజెక్ట్ ఖర్చు, యూనిట్ల సంఖ్య, కేంద్రం నుంచి క్లియరెన్స్‌లు పొందడానికి ప్రతిపాదిత సమయం.. వంటివన్నీ ఇందులో పొందుపర్చాలని అన్నారు.

 తెలంగాణ, కర్ణాటక, తమిళనాడును కాదని..

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడును కాదని..


బల్క్ డ్రగ్ పార్క్‌ల సంఖ్య దేశంలో పరిమితంగా ఉంటోంది. గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఇవి ఉన్నాయి. దక్షిణాదిలో ఏర్పాటు కాబోతోన్న మొట్టమొదటి అతిపెద్ద పార్క్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని సాధించడం కోసం తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. పలు రాయితీలను ప్రకటించాయి. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ మెగా ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది.

English summary
Andhra Pradesh secured the Ministry of Pharmaceuticals’s grant of Rs 1,000 crore for establishing a Bulk Drug Park in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X