'ప్రత్యేక హోదాకు ఆ 3 రాష్ట్రాలు అడ్డు!', మోడీ, వెంకయ్య, బాబులపై ఏపీలో కేసులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న రాష్ట్రాలు... కర్నాటక, తమిళనాడు, ఒరిస్సాలు అని కేంద్రమంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా పైన మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు అన్ని అర్హతలున్నాయన్నారు. దీనిని కేంద్ర ఆర్థిక సంఘమే ప్రకటించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరాదని కర్ణాటక, తమిళనాడులతో పాటు ఒరిస్సా కేంద్రం వద్ద వాదిస్తున్నాయన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షగానే మారిందన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే దాకా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

పోలీసు స్టేషన్లలో కేసులు
ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వకుండా విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రధాన నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల పైన, ప్రత్యేక హోదా సాధన పట్టకుండా ఉన్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పైనా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీవ్యాప్తంగా కేసులు పెడుతున్నారు.
మోడీ, వెంకయ్య, చంద్రబాబుల పైన మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా నెహ్రూ చెప్పారు.
ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదన్నారు. దేవినేనితో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన కుమారుడు దేవినేని అవినాశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications