'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే (ఫోటోలు)

అమరావతి: హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయ భవనాలను ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవలే తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 27 నాటికి అంతా సిద్ధం అవుతుందని, హెచ్‌ఓడీలతో పాటు సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఉన్నపళంగా తమను రాజధానికి వచ్చేయంటే సాధ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము వచ్చేది లేదని కొందరు ఉద్యోగులు గట్టిగా చెబుతున్నారని సమాచారం. ఎలాగైనా సరే ఉద్యోగులను రాజధానికి తరలించాలనే ఉద్దేశ్యంతో 30 శాతం హెచ్‌ఆర్ఏను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

అయితే వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న ఆరు బ్లాకుల్లో రెండు బ్లాకులు మాత్రమే స్లాబ్‌స్ధాయికి వచ్చాయి. మిగిలిన నాలుగు బ్లాకులు కేవలం పిల్లర్ల వరకే పూర్తయయ్యాయి. కాగా, స్లాబ్‌లు పూర్తయిన రెండు బ్లాకులు కూడా క్యూరింగ్ పూర్తవ్వాలంటే కనీసం మరో రెండు వారాలు పడుతుందని సమాచారం.

దీనిని బట్టి చూస్తే అప్పటికి ప్రభుత్వం విధించిన జూన్ 27 డెడ్‌లైన్ ముంచుకు వచ్చేస్తుంది. స్లాబ్ క్యూరింగ్ పూర్తయినంత మాత్రాన భవనం ఉపయోగంలోకి వచ్చేస్తుందని కాదని కొందరు అంటున్నారు. ఆ తర్వాత భవంతిలో చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉంటాయి. అంటే పూర్తిస్ధాయిలో తాత్కాలిక సచివాలయం సిద్దం అయ్యేందుకు ఇంకో రెండు నెలలైనా పడుతుంది.

బిల్డింగ్ స్లాబ్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రికల్ పనులు మొదలవుతాయి. దాంతో పాటు బాత్‌రూమ్ ఫిట్టింగ్‌లు, మంచినీటి పైప్‌లైన్లు వేయటం తదితరాలు పూర్తి చేసిన తర్వాతనే ఫ్లోరింగ్ పనులు మొదలవుతాయి. ఫ్లోరింగ్ కూడా పూర్తయిన తర్వాత భవనం మొత్తానికి పెయింట్ ప్రారంభిస్తారు.

రాబోయేది వర్షాకాలం కావడంతో నిర్మాణ పనులు అనుకున్నవి అనుకున్నట్లు జరగడం లేదనే వాదన వినిపిస్తోంది. ఒక రోజు వర్షం పడితే రెండు రోజుల పనులు ఆగిపోతున్నట్లు తెలిసింది. బిల్డింగ్‌లోని పనులు పూర్తిగా అయిపోయిన తార్వత రహదారుల నిర్మాణం, డ్రైనేజి వ్యవస్ధ ఏర్పాటు తదితర బయట పనులు మొదలుపెట్టాలి.

అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల బిల్డింగ్ లోపలి పనులే కాకుండా వెలుపల చేయాల్సిన పనులకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణించే వాహనమే బురదలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

సీఎం ప్రయాణించే బస్సు కావడంతో బురదలో నుండి బయటకు తీయటానికి యుద్ధ ప్రాతిపదికన పలువురు అధికారులు ప్రయత్నాలు చేసారు. బురదలో కూరుకుపోయిన బస్సును బయటకు తీయటానికి ఉన్నతాధికారులు భారీ క్రేన్లను ఉపయోగించి, ఆరు గంటల కష్టపడిన తర్వాతగానీ బస్సు బయటకు రాలేదు.

సాక్ష్యాత్తూ ప్రయాణించే వాహనానికే అటువంటి సమస్య ఎదురైనపుడు సామాన్య ఉద్యోగుల ప్రయాణించే వాహనాలు బురదలో కూరుకుపోతే పరిస్థితి ఏంటని ఉద్యోగుల అనుమానం. ఇందులో భాగంగానే తాత్కాలిక సచివాలయం చుట్టు పక్కల రహదారి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నాయి.

మరోవైపు జూన్ 27వ తేదీని గడువుగా విధించిన ప్రభుత్వం ఉద్యోగుల తరలింపుపై ఇంకా ఎలాంటి ఏర్పాట్లను చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి తరలి వెళ్లే ఉద్యోగులు, వారి పిల్లల స్థానికత విషయంలో కేంద్రం నుంచి ఇంత వరకూ అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో వందలాది మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న ఆరు బ్లాకుల్లో రెండు బ్లాకులు మాత్రమే స్లాబ్‌స్ధాయికి వచ్చాయి. మిగిలిన నాలుగు బ్లాకులు కేవలం పిల్లర్ల వరకే పూర్తయయ్యాయి. కాగా, స్లాబ్‌లు పూర్తయిన రెండు బ్లాకులు కూడా క్యూరింగ్ పూర్తవ్వాలంటే కనీసం మరో రెండు వారాలు పడుతుందని సమాచారం.

'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

దీనిని బట్టి చూస్తే అప్పటికి ప్రభుత్వం విధించిన జూన్ 27 డెడ్‌లైన్ ముంచుకు వచ్చేస్తుంది. స్లాబ్ క్యూరింగ్ పూర్తయినంత మాత్రాన భవనం ఉపయోగంలోకి వచ్చేస్తుందని కాదని కొందరు అంటున్నారు. ఆ తర్వాత భవంతిలో చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉంటాయి. అంటే పూర్తిస్ధాయిలో తాత్కాలిక సచివాలయం సిద్దం అయ్యేందుకు ఇంకో రెండు నెలలైనా పడుతుంది.

 'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

బిల్డింగ్ స్లాబ్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రికల్ పనులు మొదలవుతాయి. దాంతో పాటు బాత్‌రూమ్ ఫిట్టింగ్‌లు, మంచినీటి పైప్‌లైన్లు వేయటం తదితరాలు పూర్తి చేసిన తర్వాతనే ఫ్లోరింగ్ పనులు మొదలవుతాయి. ఫ్లోరింగ్ కూడా పూర్తయిన తర్వాత భవనం మొత్తానికి పెయింట్ ప్రారంభిస్తారు.

 'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

'తాత్కాలికం'లోనూ తాత్సారమే?: 27లోగా స్టాఫ్ తరలింపు కష్టమే

రాబోయేది వర్షాకాలం కావడంతో నిర్మాణ పనులు అనుకున్నవి అనుకున్నట్లు జరగడం లేదనే వాదన వినిపిస్తోంది. ఒక రోజు వర్షం పడితే రెండు రోజుల పనులు ఆగిపోతున్నట్లు తెలిసింది. బిల్డింగ్‌లోని పనులు పూర్తిగా అయిపోయిన తార్వత రహదారుల నిర్మాణం, డ్రైనేజి వ్యవస్ధ ఏర్పాటు తదితర బయట పనులు మొదలుపెట్టాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+