జగన్ ప్రభుత్వాన్ని కూల్చేలా బీజేపీ కుట్ర -వార్ బిగిన్ : టీడీపీతో మిలాఖత్ సంకేతాలు..!!

వైసీపీ-బీజేపీ మధ్య రాజకీయ అంతరం పెరిగిపోతోంది. కొద్ది కాలం క్రితం వరకు ఏపీలో రాజకీయంగా వేర్వేరుగా కనిపించినా...కేంద్రం స్థాయిలో రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య సత్సంబంధాలే కొనసాగాయి. పార్లమెంట్ సమావేశాల తీరు నుంచి ఒక్క సారిగా వైసీపీలో మార్పు మొదలైంది. ఇక , తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత ఒక్క సారిగా వైసీపీ మంత్రులు బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపీలో
వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలా అని బీజేపీ చూస్తోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేసారనది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 జగన్ ప్రభుత్వాన్ని కూల్చేలా బీజేపీ..

జగన్ ప్రభుత్వాన్ని కూల్చేలా బీజేపీ..

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ దాఖలు చేసిన రఘురామ రాజు విషయంలో వైసీపీ కోరిన విధంగా చర్యలు తీసుకోకపోవటం ఏపీ అధికార పార్టీ నేతలకు రుచించటం లేదు. దీంతో..వారికి పరోక్షంగా మద్దతిచ్చేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నార నే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ కోణంలోనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారా అనే చర్చ మొదలైంది. పేర్ని నాని అంతటితో ఆగకుండా...కాషాయం కప్పుకున్న బాబాను సీఎం చేయాలని బీజేపీ కలలు కంటోందని వ్యాఖ్యానించారు.

 బీజేపీకి చంద్రబాబు ప్రేమ లేఖలు...

బీజేపీకి చంద్రబాబు ప్రేమ లేఖలు...

రాష్ట్రంలో గుళ్లు పడగొడితే అన్నీ మూసుకుని కూర్చున్న వాళ్లను చూశాం కదా అంటూనే..అందరూ గురివింద గింజలేనన్నారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలు. గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రేమలేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేసారు. కొద్ది రోజులుగా టీడీపీ తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం తిరిగి ఏపీలో చంద్రబాబుతో జత కట్టేందుకు సుముఖంగా లేరని..అయినా, టీడీపీ ప్రయత్నాలు మాత్రం మానుకోలేదని చెబుతున్నారు.

 బీజేపీతో ఇక తాడో - పేడో..

బీజేపీతో ఇక తాడో - పేడో..

వీటన్నింటిని పరిశీలిస్తున్న వైసీపీ.. తాము బీజేపీకి అవసరమైన ప్రతీ సందర్బంలోనూ మద్దతుగా నిలిచామని గుర్తు చేస్తున్నారు. కానీ, పోలవరంలో సవరించిన ధరలకు ఆమోదం తెలపకపోవటం పైన వైసీపీ ముఖ్య నేతలు అసహనంతో కనిపిస్తున్నారు. ఇక, ఆర్దిక వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల విషయంలోనూ వైసీపీ సీరియస్ గా కనిపిస్తోంది. దీంతో..తాము పూర్తిగా వారికి సహకరిస్తున్నా..తమకు మాత్రం వారి నుంచి ఎటువంటి ప్రయోజనం కలగటం లేదనే భావన వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

 మంత్రులకు సీఎం దిశా నిర్దేశం..

మంత్రులకు సీఎం దిశా నిర్దేశం..

దీంతో...ఇక, బీజేపీని సైతం ఇతర పార్టీల తరహాలోనే కౌంటర్ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సైతం బీజేపీ-టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించిన సీఎం...గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ఆదేశంచినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా? ఎవరైనా అప్పులు చేయని వాళ్లు చెప్పాలి...అంటూ మంత్రి పేర్ని నాని నిలదీసారు. రాజకీయ పార్టీలు ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకోవడం మామూలే. బీజేపీ కూడా రాజకీయ పార్టీయే. ఎన్‌జీవో కాదు కదా..అంటూ వ్యాఖ్యానించారు.

 అటు ఢిల్లీలో..ఇటు అమరావతిలో..

అటు ఢిల్లీలో..ఇటు అమరావతిలో..

ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ అవసమైతే బీజేపీతో ఇక తాడో పేడో తేల్చుకోవటానికే సిద్దపడినట్లుగా కనిపిస్తోంది. అటు ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా కేంద్రం పైన ఒత్తిడి తెచ్చ వ్యూహం..ఇటు రాష్ట్రంలో సైతం బీజేపీని నేరుగా కార్నర్ చేయాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో వైసీపీ వర్సెస్ బీజేపీ పోరు తీవ్ర స్థాయికి చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ స్థానం భర్తీ చేస్తామని చెబుతూ వచ్చిన బీజేపీ నేతలు..ఇప్పుడు వైసీపీ కౌంటర్ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 బీజేపీ రియాక్షన్ ఏంటి..

బీజేపీ రియాక్షన్ ఏంటి..

అసలు, ఇంత సడన్ గా ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చాలనేది కాషాయం కప్పుకున్న బీజేపీ నేతల ఆలోచన అంటూ మంత్రివర్గ సమావేశం తరువాత మంత్రి వ్యాఖ్యానించటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. దీనికి బీజేపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. స్టీల్ ప్లాంట్..పోలవరం...జల జగడం.. ప్రత్యేక హోదా వంటి అంశాల్లో నిలదీయటానికి వైసీపీ సిద్దం అవుతోంది. దీంతో..బీజేపీ ఏ రకంగా వీటిని ఎదుర్కొంటుంది.. ఏపీ బీజేపీ నేతలు ఏ రకంగా కేంద్రం తీరును సమర్ధించుకుంటారనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+