ఆంధ్రా విశ్వవిద్యాలయం అరుదైన రికార్డ్: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో గల ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) అరుదైన ఘనత దక్కించుంది. ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేకాదు, భారత దేశంలోని ప్రతిష్టాత్మక 19 విశ్వవిద్యాలయాల్లో 11వ స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్త హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్... అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చోటు దక్కించుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2015-2016లో ఇది రికార్డ్ సృష్టించింది. భారత్‌లోని 19 విశ్వవిద్యాలయాల్లో 11వ స్థానంలో నిలిచి, ఐఐఎస్సీ, ఐఐటీల సరసన నిలిచింది.
రానున్న ఐదేళ్లలో ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఈసారి చోటు దక్కించుకోవడంతో.. ఆ దిశగా వెళ్తోంది.

కాగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం క్యూఎస్ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లోను చోటు దక్కించుకుంది. ఇండియా టుడే - నీల్సన్ సర్వేలో భారత దేశంలో ఆంధ్రా వర్సిటీ రెండో స్థానం దక్కించుకుంది. కేంద్ర విశ్వవిద్యాలయాలను కలుపుకుంటే మాత్రం ఆంధ్రా వర్సిటీ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపైమంత్రివర్గం చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాజధాని శంకుస్థాపనను రాష్ట్ర పండుగలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు 3.2శాతం డీఏ పెంపునకు ఆమోదంతో పాటు వారి పిల్లల స్థానికత అంశంపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఆదేశాలను కూడా ఆమాత్యులు చర్చించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications