రైతుల్లో జగన్‌కు ఫాలోయింగ్ ఎక్కువ!.. బాబుకు వ్యాపారుల్లో..
సీఎంగా జగన్ కు మద్దతు పలుకుతున్నవారిలో అత్యధికులు రైతులు(39.72శాతం) కాగా.. చంద్రబాబుకు అత్యధికంగా 49.21 శాతం వ్యాపారులు సీఎంగా మద్దతు పలుకుతున్నారు.
విజయవాడ : ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వేకు సంబంధించి ఏదో ఒక ఆసక్తికర అంశం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా చంద్రబాబు-జగన్ నాయకత్వ లక్షణాలపై ఏపీ ప్రజల అభిప్రాయాలను వెలిబుచ్చుతూ.. ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది ఆంధ్రజ్యోతి. జగన్ కంటే చంద్రబాబునే ఎక్కువమంది సీఎంగా కోరుకుంటున్నారన్నది దాని సారాంశం.

సీఎంగా జగన్‌కు 41శాతం మంది మద్దతు పలుకుతుంటే.. చంద్రబాబుకు 58శాతం మంది మద్దతు పలికారు. ఇక జగన్‌కు అత్యధిక మద్దతు(56శాతం) కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో లభిస్తే.. చంద్రబాబుకు కృష్ణా జిల్లా నందిగామలో అత్యధికంగా 66.8శాతం మద్దతు లభించింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పూతలపట్టులో చంద్రబాబు-జగన్ లకు ఇద్దరికీ చెరో 50శాతం మద్దతు లభించినట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది.
మరో ఆసక్తికర విషయమేంటంటే.. జగన్‌కు లభించిన మద్దతులో అత్యధిక మద్దతు రైతు వర్గం నుంచే రావడం గమనార్హం. 39.72శాతం మంది రైతులు సీఎంగా జగన్ కు మద్దతు పలికారు. ఇక చంద్రబాబుకు లభించిన అత్యధిక మద్దతు వ్యాపార వర్గం నుంచి రావడం గమనార్హం. 49.21శాతం మంది వ్యాపారులు సీఎంగా చంద్రబాబుకు ఓటేశారు.












Click it and Unblock the Notifications